ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ జనవరి 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. ఆన్సర్ 'కీ'పై అభ్యంతరాల స్వీకరణ జనవరి 11న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి 13న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. 


అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..


అభ్యంతరాల నమోదు ఇలా..


➦ ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.


➦ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్ధులు అభ్యంతరాలను నమోదు చేయాలి. పోస్టు ద్వారా/వ్యక్తిగతంగా/ వాట్సాప్/ SMS ఇలా వేరే ఏ ఇతర మార్గాల్లోనూ అభ్యంతరాలు స్వీకరించరు.


➦ అభ్యర్థులు ప్రాథమిక కీ, పేపర్, టాపిక్ వారీగా అభ్యంతరం తెలిపే ప్రశ్న సంఖ్యను నమోదుచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో పరిగణనలోకి తీసుకోరు.


➦ అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్‌ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.


➦ అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి అభ్యంతరాలు సమర్పించాలి. 


➦ ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలు నమోదుచేయాలి.


➦ అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నలకు రూ.100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరం సరైనరదని తేలితే చెల్లించిన ఫీజుగను వెనక్కు ఇచ్చేస్తారు.


Also Read:


'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఆన్సర్ 'కీ' విడుదల, ఇక్కడ చూసుకోండి!
ఏపీలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ జనవరి 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌‌లో ఆన్సర్ కీతోపాటు క్వశ్చన్ పేపర్లను అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ప్రాథమిక ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది.
గ్రూప్-1 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ స్థాయిలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం! కటాఫ్‌ మార్కులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష ప్రశ్నపత్రం తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం.. ఉద్యోగార్థుల సత్తా పరీక్షించేందుకే ఎక్కువ నిడివిగల ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మొత్తంగా ప్రిలిమ్స్ పరీక్ష కఠినంగా ఉన్నట్లు ఎక్కువ మంది తెలిపారు. యూపీఎస్సీ స్థాయిలో ప్రశ్నపత్రం ఉందని చెప్పారు.
ప్రశ్నపత్రం, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...