Cyient DLM IPO: ఎలక్ట్రానిక్ తయారీ సేవలు, పరిష్కారాలు (solutions) అందించే సైయెంట్ డీఎల్‌ఎం, రూ. 740 కోట్ల సమీకరణ కోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (initial public offering - IPO) ప్రకటించబోతోంది. ఇందుకోసం, క్యాపిటల్ మార్కెట్ వాచ్‌డాగ్ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసింది.
హైదరాబాద్‌కు చెందిన IT సేవల సంస్థ సైయెంట్ లిమిటెడ్ (Cyient Ltd) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ సైయెంట్ డీఎల్‌ఎం.
పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ
రూ. 740 కోట్ల సమీకరణ పూర్తిగా ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా జరుగుతుంది. ఆఫర్ ఫర్ సేల్‌లో (OFS) ఒక్క షేర్ కూడా లేదు. అంటే, మాతృసంస్థ అయిన సైయెంట్, ఈ కంపెనీలో తనకున్న స్టేక్ నుంచి సింగిల్ షేరును కూడా అమ్మడం లేదు.
ప్రైవేట్ ప్లేస్‌మెంట్, రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఆఫర్ లేదా మరేదైనా పద్ధతి ద్వారా రూ. 148 కోట్ల వరకు సేకరించేందుకు కూడా ఈ కంపెనీ ఆలోచించచవచ్చు. ఒకవేళ, ప్రి-ఐపీవో ప్లేస్‌మెంట్ ద్వారా నిధులను సమీకరించినట్లయితే, దానికి అనుగుణంగా ఫ్రెష్ ఇష్యూ సైజ్‌ను కంపెనీ తగ్గిస్తుంది.
IPO ద్వారా సమీకరించిన డబ్బును మూలధన అవసరాలకు, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకుంటామని DRHPలో ఈ కంపెనీ పేర్కొంది.
సైయెంట్ డీఎల్‌ఎం బిజినెస్
గత 20 సంవత్సరాలుగా సైయెంట్ డీఎల్‌ఎం బిజినెస్ చేస్తోంది. ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ రంగాల్లో ఉన్న అంతర్జాతీయ 'ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్' కంపెనీలకు (OEMలు) ఈ సంస్థ ఒక క్వాలిఫైడ్ సప్లయర్. అంటే.. ఆయా దేశీ, విదేశీ కంపెనీలకు సేవలు అందించడంతో పాటు సంక్లిష్ట వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. హానీవెల్ ఇంటర్నేషనల్, థేల్స్ గ్లోబల్ సర్వీసెస్, ఏబీబీ, బీఈఎల్, మొయిబో డయాగ్నొస్టిక్స్ వంటి సంస్థలతో కలిసి పని చేస్తోంది. సైయెంట్ డీఎల్‌ఎంకు హైదరాబాద్, బెంగళూరు, మైసూర్‌లో అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.
ఆర్థిక స్థితిగతులు
FY20 నుంచి ఈ కంపెనీ మెరుగైన ఆర్థిక పనితీరును నివేదించింది. FY22లో లాభం 237 శాతం YoY పెరిగి రూ. 40 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా 14.7 శాతం పెరిగి రూ. 720.5 కోట్లకు చేరుకుంది. ఎబిటా (EBITDA) 83 శాతం పెరిగి రూ. 84 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్ 4 శాతం పైగా పెరిగి, FY21లోని 7.31 శాతం నుంచి 11.66 శాతానికి చేరింది.
సెప్టెంబర్ FY23తో ముగిసిన ఆరు నెలల కాలానికి, ఈ కంపెనీ రూ. 340.3 కోట్ల ఆదాయాన్ని, రూ. 13.42 కోట్ల లాభాన్ని సాధించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.