ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు ఆగస్టు 17న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి 11 వరకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఆగస్టు 17న సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చూసుకోవచ్చు. మొత్తం పోస్టులు 111 కాగా.. 110 పోస్టుల ఫలితాలను మాత్రమే ఏపీపీఎస్సీ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కేవలం 11 నెలల్లోనే తుది ఎంపిక ఫలితాలను వెల్లడించడం విశేషం.


గ్రూప్-1 పోస్టులకు సంబంధించి పోస్టులవారీగా ఎంపికైన అభ్యర్థులు..


➥ డిప్యూటీ కలెక్టర్: 13 


➥ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్(ఏపీ): 13 


➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ-సివిల్): 13 


➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్): 02


➥ డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ (రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్): 02


➥ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 11


➥ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్: 02


➥ మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 16


➥ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ (ఏపీ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ సర్వీస్): 03


➥ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 01


➥ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 03


➥ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 06


➥ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ (గ్రేడ్-2): 17


➥ డిప్యూటీ రిజిస్ట్రార్: 01


➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 06


➥ అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్: 01 


గ్రూప్-1 తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..



ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ జనవరి 27న విడుదల చేసింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.  ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపికచేశారు. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


త్వరలో మరిన్ని గ్రూప్-1, 2 పోస్టులకు నోటిఫికేషన్లు - గౌతమ్ సవాంగ్ వెల్లడి
త్వరలో 1,199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇవి కాకుండా గ్రూప్ 1, 2 పోస్టులకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ లోపు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, త్వరలోనే గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రూప్  1 పోస్టులు 100, గ్రూప్ 2 - వెయ్యి పోస్టులకు పైగా ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు.  గ్రూప్స్ సిలబస్ లో మార్పులు చేస్తున్నామని, యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడతామని అన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

తెలుగులోనూ ఏఎంవీఐ 'పేపర్-1' ప్రశ్నపత్రం, దరఖాస్తుకు మరో అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షలో జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్షల ప్రశ్నలను ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. సబ్జెక్టు ప్రశ్నలు మాత్రం యథావిధిగా ఇంగ్లి్ష్‌లోనే ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు 16న అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతేడాది సెప్టెంబరు 30న ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్లు తెలిపింది. అయితే సరైన అర్హతలు కలిగి, అప్పుడు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆగ‌స్టు 16న ఏపీపీఎస్సీ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...