ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చురుగ్గా కసరత్తు చేస్తుంది. అన్ని కుదిరితే మరో పది రోజుల్లో 'గ్రూపు-2' నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన ప్రకారం మొత్తం 182 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది.


అయితే.. ప్రస్తుత 'గ్రూప్‌-2' సిలబస్ అలాగే కొనసాగిస్తూ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ విధానంలో మార్పులు చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు కమిషన్ అంతర్గతంగా చర్చించి ఆమోదించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ జారీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గ్రూప్ -1 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది గ్రూప్-2 ప్రిపరేషన్ కూడా మొదలెట్టారు. ఇక గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌–1, 2 పోస్టుల భర్తీకి గత మార్చి 31న ఆర్థిక శాఖ అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్‌–1లో 110, గ్రూప్‌–2లో 182 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటికే గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా గ్రూప్-1లో 92 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి అధికారుల కతరత్తు చేస్తున్నారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపను 182 గ్రూప్-2 పోస్టుల్లో ఎన్ని పోస్టులను నోటిఫికేషన్‌లో చేరుస్తారో తెలియాల్సి ఉంది.


:: Also Read ::

APPSC: 'గ్రూప్-1' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల పూర్తి వివరాలు ఇవే! (చివరితేది: 01.11.2022)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. ఇటీవలే వివిధ శాఖల్లో 269 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్ తాజాగా 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. అక్టోబరు 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
 


APPSC EXAM HALLTICKETS: వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలోని పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 12న విడుదల చేసింది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం మూడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 
హాల్‌టికెట్లు, పరీక్షల తేదీల కోసం క్లిక్ చేయండి..


APPSC: 'గ్రూప్-4' ఫలితాలు విడుదల, కటాఫ్ మార్కులివే! ఫైనల్ కీ రిలీజ్!
ఏపీలో గ్రూప్-4 ప్రిలిమనరీ/స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 12న విడుదల చేసింది. ఏపీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్  అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 11,574 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. జిల్లాలవారీగా మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 
ఫలితాలు, కటాఫ్ మార్కులు, ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..



APPSC Recruitment:  ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, పూర్తి వివరాలు ఇలా!

 ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం269 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా  పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంతే కాకుండా ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...