ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగాల భర్తీకి నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నవంబరు 16న విడుదల చేయనుంది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనుంది.

ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం ఇవ్వనున్నారు. నవంబరు 17 నుంచి 19 వరకు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాట్సాప్, SMS, ఫోన్, ప్రత్యక్షంగా లేదా మరే ఇతర విధానాల్లో అభ్యంతరాలను స్వీకరించరని గమనించాలి. గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు.

ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA
ASSISTANT CONSERVATOR OF FOREST, NOTIFICATION NO.04/2022
NOTIFICATION ON INITIAL KEY
WEB NOTE

The Commission has conducted the recruitment examination for the post of Assistant Conservator of Forest in AP Forest Service from 09.11.2022 to 11.11.2022 in 16 districts. The Initial key and individual response sheets hosted on Commission’s website on 16.11.2022 (https://psc.ap.gov.in). If any Candidate wants to file objections on any questions or key, he/she may file objections through the link provided. The objections from the candidates will be accepted from 17.11.2022 to 19.11.2022 through Online only.  Objections would not be accepted through Post, WhatsApp, SMS, Phone, individual submission or any other mode. Objections received after due date shall not be considered.

Place: Vijayawada                                                                                                    Sd/-Dt:15.11.2022                                                                                                       SECRETARY

Also Read:

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు ప్రారంభం - అర్హత, ఎంపిక వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...