హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. డిప్లొమా, బీటెక్, ఏదైనా సాధారణ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావచ్చు. నవంబరు 10న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు.
ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా విభాగాల్లో 2019, 2020, 2021, 2022 పాసై ఉండాలి. ఇక డిగ్రీ అభ్యర్థులు 2020, 2021, 2022 పాసైనవారు హాజరుకావచ్చు. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్/టెక్నాలజీ), డిప్లొమా (ఇంజినీరింగ్/టెక్నాలజీ) అప్రెంటిస్ పోస్టులకు, ఇతర సంస్థల్లో నాన్-ఇంజినీరింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తున్నారు.
వివరాలు..
* గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్: 35 ఖాళీలు
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 20
2) టెక్నీషియన్ అప్రెంటిస్: 15
విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్/ ఈఈఈ, సివిల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్/ఐటీ, కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్.
అర్హతలు: గ్రాడ్యుయేట్అప్రెంటిస్ పోస్టులకు డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణత, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి. ఏదైనా డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీసీఏ, ఇతర డిగ్రీ కోర్సులు) వారు కూడా దరఖాస్తు కావచ్చు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్లకు రూ.9000, టెక్నీషియన్ అభ్యర్థులకు రూ.8000.
ఎంపిక విధానం: పదోతరగతి, డిగ్రీ, డిప్లొమాలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ షిప్ మేళా తేదీ: 10-11-2022.
అభ్యర్థులకు సూచనలు..
* మేళాకు హాజరయ్యేవారు ధ్రువపత్రాల పరిశీలన కోసం విద్యార్హతకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను, బయోడేటా ఫామ్ తీసుకురావాలి. అదేవిధంగా సర్టిఫికేట్ల 3 సెట్ల జిరాక్స్ కాపీలను కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
* నేషనల్ అప్రెంటిస్ పోర్టల్‌లో (www.mhrdnats.gov.in ) రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు అందుబాటులో ఉండాలి.
* అభ్యర్థులు తమ పేరు, బ్రాంచ్, పాసైన సంవత్సరం వివరాలతోపాటు యూజర్ ఐడీ ఉన్న కాపీని 4 సెట్లు తీసుకెళ్లాలి.
* ఇంతకుముందు అప్రెంటిస్ శిక్షణ తీసుకున్నవారు హాజరుకావడానికి వీల్లేదు.
* ఎంపికైనవారికి ఏడాదిపాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది.
* శిక్షణ సమయంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్/నాన్ ఇంజినీరింగ్) అభ్యర్థులకు నెలకు రూ.9,000; డిప్లొమా అప్రెంటిస్ అభ్యర్థులకు నెలకు రూ.8000 స్టైపెండ్‌గా ఇస్తారు.
* వాక్‌ఇన్‌కు హాజరయ్యేవారికి ఎలాంటి ప్రయాణ ఖర్చులు చెల్లించరు.
వాక్‌ఇన్ వేదిక:
Nawab Shah Alam Khan College of Engineering & Technology,
#16-4-1, Subedar Ameer Ali Khan Road,
New Malakpet,
Hyderabad -500 024.
:: Also Read ::
DRDO: డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబ్‌లో అప్రెంటిస్ ఖాళీలు - ఐటీఐ, డిప్లొమా ఉండాలి!
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా మొత్తం 101 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా(ఏఎన్‌ఎం) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధులు నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డీఆర్‌డీఎల్ పనిచేస్తుంది.
నోటిఫికేషన్, అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో అప్రెంటిస్‌షిప్‌లు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 2022-23 సంవత్సరానికి ఏడాది టెక్నీషియన్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుని అనుసరించి బీఈ, బీటెక్, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష లేదు. వాక్-ఇన్ నవంబర్ 09న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..