కాన్పూర్‌‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 103 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 15లోగా ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 103


పోస్టుల వారీగా ఖాళీలు..


➥ ప్రోస్టెటిస్ట్ అండ్‌ ఆర్థోటిస్ట్-33


➥ ఆడియాలజిస్ట్-41


➥ ప్రత్యేక అధ్యాపకులు-11


➥ క్లినికల్ ఫిజికాలజిస్ట్-11


➥ మెడికల్ ఆఫీసర్-01


➥ అసిస్టెంట్ మేనేజర్(ప్లాస్టిక్)-01


➥ అసిస్టెంట్ మేనేజర్ -మెకానికల్(న్యూ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌)-01


➥ అసిస్టెంట్ మేనేజర్ (ట్రైనింగ్)-01


➥ అసిస్టెంట్ మేనేజర్ (ఏడీ)-01


➥ జూనియర్ మేంజర్ కాస్టింగ్-01


➥ ఫైనాన్స్ కన్సల్టెంట్-02


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టుల అర్హతల ఆధారంగా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ బీటెక్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఎంబీబీఎస్/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 34 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.25,000-రూ.90,000 చెల్లిస్తారు.


చిరునామా:  Manager (Administration), 
                 Artificial Limbs Manufacturing Corporation of India, 
                 G.T. Road, Kanpur – 209217 (U.P).


దరఖాస్తు చివరితేది: 15.06.2023.


Notification & Application


Website


ALso Read:


ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌) టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 15 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..