Telangana Vice Chancellors Recruitment: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల(వీసీల) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని 10 యూనివర్సీలకు వీసీలను నియమించనున్నారు. వీటిలో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), కాకతీయ యూనివర్సిటీ (వరంగల్‌), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్‌), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్‌)లకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించనున్నారు.


ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జనవరి 28న ప్రారంభంకాగా, సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 12న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  కనీసం ప్రొఫెసర్‌ 10 సంవత్సరాలుగా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వీసీని మూడేళ్ల కాలపరిమితికి నియమించనున్నారు. 


వివరాలు..


* తెలంగాణ యూనివర్సిటీల్లో వీసీల నియామకం 


ఖాళీలున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), కాకతీయ యూనివర్సిటీ (వరంగల్‌), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్‌), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్‌).


అర్హతలు: కనీసం ప్రొఫెసర్‌ 10 సంవత్సరాలు లేదా పరిశోధన, అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. 


పదవికాలం: 3 సంవత్సరాలు.


దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో ఎక్సెల్ ఫార్మాట్‌లో ఉన్న బయోడేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోని వివరాలు నింపి, సంబంధిత చిరునామాతోపాటు, ఈమెయిల్ చిరునామాకు కూడా పంపాల్సి ఉంటుంది.   అభ్యర్థులు ఏ యూనివర్సిటీకి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారో తెలిసే విధంగా దరఖాస్తులు పంపే కవరు మీద ''The Name of the University Applied For'' అని రాసి యూనివర్సిటీ పేరు రాయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అందిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు తమ బయోడేటాలో అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలు, అచీవ్‌మెంట్లు, అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ అనుభవం తదితర వివరాలన్నింటిని రాయాల్సి ఉంటుంది. బయోడేటా నమూనాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆ వివరాలన్నింటిని స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. సంబంధిత యూనివర్సిటీలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులు సంబంధిత హెచ్‌వోడీలు లేదా ఉన్నతాధికారులకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 


ఎంపిక విధానం: సెర్చ్‌ కమిటీల ద్వారా వీసీల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో వర్సిటీకి ముగ్గురితో సెర్చ్‌ కమిటీ ఏర్పడుతుంది. వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేస్తుంది. ప్రభుత్వ నామిని, యూజీసీ చైర్మన్‌ నామిని, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) నామినీలతో ఈ సెర్చ్‌ కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ సమావేశమై అందరి బయోడేటాలను పరిశీలించి, ముగ్గురు పేర్లను వీసీగా నియమించేందుకు సూచిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.01.2024.


* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 28.01.2024.


ఈమెయిల్: umsvc2024@gmail.com


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Principal Secretaty to Govt,
Higher Education(UE) Department,
Room N0.7, First Floor, 
Dr. B.R.Ambedkar Telangana Secretariat,
Hyderabad-500 022.
Ph.No.91-40-23454287, 91-40-23454297.  


NOTIFICATION


APPLICATION




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...