AP CASS WALKIN: ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌ పరిధిలో 185 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ల నియామకాలకు సంబంధించిన తాజా ఇంటర్వ్యూ షెడ్యూలును ఏపీ వైద్య సేవల నియామక మండలి ఫిబ్రవరి 20న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అభ్యర్థులకు ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో వాక్‌‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వాస్తవానికి మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 21, 23, 26 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ షెడ్యూలులో అధికారులు మార్పులు చేశారు. అభ్యర్థులు వాక్‌ఇన్ సమయంలోనే తమ దరఖాస్తులను నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, నిర్ణీత మార్గదర్శకాల కోసం అధికారిక  వెబ్‌సైట్ చూడవచ్చు.


రెగ్యుల‌ర్, కాంట్రాక్ట్, కొటేషన్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు సంబంధిత చిరునామాలో నిర్వహించే వాకిన్ రిక్రూట్‌మెంట్‌కు అర్హత గల అభ్యర్థులు స్వయంగా హాజరుకావాలని ఆయన కోరారు. వైద్యారోగ్యశాఖలో ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతర నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. 


➥ ఫిబ్రవరి 28న(బుధవారం): జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియోలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 


➥ మార్చి 1న(శుక్రవారం): గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, పాథాలజీ విభాగాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 


వాక్‌ఇన్ వేదిక: O/o. Directorate of Secondary Health (formerly APVVP ), A.P
                           H.No.77-2/G, Lakshmi Elite Building,
                           Prathur Road, Tadepalli - 522501,
                           Guntur District, Andhra Pradesh.


పోస్టుల వివరాలు..


* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లు


ఖాళీల సంఖ్య: 185


విభాగాలవారీగా ఖాళీలు...


➥ జనరల్ మెడిసిన్: 33 పోస్టులు


➥ జనరల్ సర్జరీ: 19 పోస్టులు


➥ డెర్మటాలజీ: 9 పోస్టులు
 
➥ ఆర్థోపెడిక్స్: 7 పోస్టులు


➥ రేడియోలజీ: 32 పోస్టులు


➥ ఫోరెన్సిక్ మెడిసిన్: 4 పోస్టులు


➥ గైనకాలజీ: 19 పోస్టులు


➥ పీడియాట్రిక్స్: 10 పోస్టులు


➥ అనస్తీషియా: 18 పోస్టులు


➥ ఈఎన్‌టీ: 16 పోస్టులు


➥ ఆప్తాల్మాలజీ: 11 పోస్టులు
 
➥ పాథాలజీ: 7 పోస్టులు


అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.


వయోపరిమితి: 01-07-2024 నాటికి 42 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. కాంట్రాక్ట్, కొటేషన్ పద్ధతిలో ఎంపికయ్యే డాక్టర్లు 01-07-2024 నాటికి 70 సంవత్సరాలలోపు ఉండాలి. 


జీతభత్యాలు: రెగ్యులర్ పోస్టులకు నెలకు రూ.61,960 - రూ.1,51,370 వరకు పేస్కేలు ఉంటుంది. ఇతర భత్యాలు అదనం. ఇక కాంట్రాక్ట్ విధానంలో ఎంపికైనవారికి గిరిజన(ట్రైబల్) ప్రాంతాల్లో అయితే రూ.2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు, నగర ప్రాంతాల్లో అయితే రూ.1.3 లక్షల చొప్పున వేతనం ఇస్తారు.


Notification


Website