ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని వీఎస్‌ లక్ష్మీ మహిళా డిగ్రీ కళాశాలలో ఆగస్టు 26న జాబ్‌మేళా  నిర్వహించనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ మేళాలో 15 ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో వాక్‌ఇన్‌కు హాజరుకావచ్చు.


వివరాలు..  


మొత్తం పోస్టుల సంఖ్య: 645.


➥ ట్రైనీ కెమిస్ట్


సంస్థ: డెక్కన్ ఫిన్ కెమికల్స్ ప్రైవేట్‌ లిమిటెడ్: 


➥ ప్రొడక్షన్ అసిస్టెంట్


సంస్థ: అరబిందో.


➥ రెగ్యులర్/ అప్రెంటిస్, కౌంటర్ సేల్స్‌మ్యాన్, టెలికాలర్, కంప్యూటర్ ఆపరేటర్


సంస్థ: శ్రీ గోపాల్ ఆటోమోటివ్ లిమిటెడ్. 


➥ ప్రొడక్షన్ ట్రైనీ/ ఆపరేటర్లు


సంస్థ: డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్


➥ ప్రొడక్షన్ ట్రైనీ/ ఆపరేటర్లు


సంస్థ: ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ 


➥ ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్


సంస్థ: అపోలో ఫార్మసీ


➥ బీఆర్‌ఈ, రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, బీఆర్‌ఎం


సంస్థ: క్వెస్‌కార్ప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్.


➥ ఫార్మసిస్ట్, సీఎస్‌ఏ


సంస్థ: మెడ్‌ప్లస్ ఫార్మసీ


➥ ఎంఎఫ్‌జీ ఆపరేటర్లు


సంస్థ: టీసీఎల్‌ 


➥ కస్టమర్ ఎగ్జిక్యూటివ్, జేఆర్‌ఈ, ఇంటర్న్‌షిప్


సంస్థ:  ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్: 


➥ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్


సంస్థ: పేటీఎం.


➥ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ 


సంస్థ: ఫ్లిప్‌కార్ట్.


➥ ప్రొడక్షన్ ట్రైనీ


సంస్థ: బ్లూస్టార్ క్లైమాటెక్ లిమిటెడ్.


➥ ఫీల్డ్ అసోసియేట్


సంస్థ: ఎన్‌ అండ్‌ ఎన్‌ మీడియా.  


➥ ట్రైనీ


సంస్థ: యోకోహామా ప్రైవేట్ లిమిటెడ్.  


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ, పీజీ తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల వయసుగల వారు అర్హులు.


జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జీతం ఉంటుంది.


ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


డ్రైవ్‌ తేదీ: 26.08.2023.


డ్రైవ్‌ నిర్వహణ వేదిక:  V.S Laxmi Womens Degree College, Kakinada 


పనిప్రదేశాలు: పరవాడ, కాకినాడ, శ్రీసిటీ, రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం, రేణిగుంట, విశాఖపట్నం, ఏపీలోని పలు ప్రాంతాలు.


Website


ALSO READ:


హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 276 సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టులు
ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సదరన్‌ రైల్వేలో 790 ఏఎల్‌పీ, టెక్నీషియన్, జేఈ పోస్టులు - అర్హతలివే!
Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పని చేయుటకు జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఏఎల్‌పీ/టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ & ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 790 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..