విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 37
1) జూనియర్ అసిస్టెంట్: 13 పోస్టులు
2) డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 10 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్‌, ఎంఎస్ ఆఫీస్/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజినీరింగ్ సర్టిఫికెట్/ కంప్యూటర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
3) ఆఫీస్ సబార్డినేట్: 14 పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిషు భాషలు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
వయో పరిమితి: 30.11.2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు రూ.23,500; డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.23,500; ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: జేఏ, డీఈవో ఖాళీలకు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023.
➥ స్కిల్ టెస్ట్కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల వెల్లడి: 03.02.2023.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 07.02.2023.
➥ స్కిల్ టెస్ట్ తేదీ: 11, 12.02.2023.
Also Read:
యూసీఐఎల్లో వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులు, అర్హతలివే!
ఝార్ఖండ్ రాష్ట్రం జాదుగూడ మైన్స్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పదోతరగతి అర్హతతోపాటు వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ భర్తీ చేపట్టనున్నారు. ట్రేడ్ టెస్టు ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్పీఎఫ్లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..