ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 6న పోలీసు నియామక బోర్డు విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబరు 12 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నెంబరు 9441450639, 9100203323 లేదా ఈమెయిల్ mail-slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..
➥ అక్టోబరు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
➥ అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం..
ఎస్‌ఐ తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్-2 తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్), పేపర్-2 అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్), పేపర్-4 జనరల్ స్టడీస్(ఆబ్జెక్టివ్) ఉంటాయి. వీటిలో పేపర్-1, పేపర్-2 కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.
ఏ ప్రాంతంలో ఎంత మంది?
ఫిజికల్ ఈవెంట్లలో మొత్తం 31,193 మంది అభ్యర్థులు సాధించారు. వీరిలో పురుషులు-27,590 మంది, స్త్రీలు-3603 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వీరికి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
➥ విశాఖపట్నం కేంద్రంలో మొత్తం 11,365 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-9913, స్త్రీలు-1452 మంది పరీక్షలు రాయనున్నారు.
➥ ఏలూరు కేంద్రంలో మొత్తం 4162 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-3649, స్త్రీలు-513 మంది పరీక్షలు రాయనున్నారు.
➥ గుంటూరు కేంద్రంలో మొత్తం 7145 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-6384, స్త్రీలు-761 మంది పరీక్షలు రాయనున్నారు.
➥ కర్నూలు కేంద్రంలో మొత్తం 8521 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-7644, స్త్రీలు-877 మంది పరీక్షలు రాయనున్నారు.
ALSO READ:
తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.1.31 లక్ష వరకు జీతం
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..