ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 5న వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా slprb@ap.gov.in మెయిల్‌లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది.
AP Constable Part - II Registration
పోస్టుల వివరాలు..
* కానిస్టేబుల్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 6100
1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
జిల్లా | ఖాళీల సంఖ్య |
శ్రీకాకుళం | 100 |
విజయనగరం | 134 |
విశాఖపట్నం (సిటీ) | 187 |
విశాఖపట్నం (రూరల్) | 159 |
తూర్పు గోదావరి | 298 |
రాజమహేంద్రవరం (అర్బన్) | 83 |
పశ్ఛిమ గోదావరి | 204 |
కృష్ణా | 150 |
విజయవాడ (సిటీ) | 250 |
గుంటూరు (రూరల్) | 300 |
గుంటూరు (అర్బన్) | 80 |
ప్రకాశం | 205 |
నెల్లూరు | 160 |
కర్నూలు | 285 |
వైఎస్సార్ - కడప | 325 |
అనంతపురం | 310 |
చిత్తూరు | 240 |
తిరుపతి అర్బన్ | 110 |
మొత్తం | 3580 |
2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
జిల్లా | ఖాళీల సంఖ్య |
ఎచ్చెర్ల- శ్రీకాకుళం | 630 |
రాజమహేంద్రవరం | 630 |
మద్దిపాడు - ప్రకాశం | 630 |
చిత్తూరు | 630 |
మొత్తం | 2520 |
శారీరక ప్రమాణాలు:
➨ పురుష అభ్యర్థులు నిర్దేశిత పొడవు, ఛాతీ కలిగి ఉండాలి. మహిళా అభ్యర్థులైతే నిర్దేశిత పొడవు, బరువు కలిగి ఉండాలి.
🔰 ఫిజికల్ ఈవెంట్లు ఇలా..
➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
🔰 మెయిన్ పరీక్ష విధానం:
➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
➨ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
Also Read:
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్: మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరునాటికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీలోని 119 పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..