ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 135 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల రెండో ఎంపిక జాబితా విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థల జాబితాను అందుబాటులో ఉంచారు. రెండో జాబితాలో మొత్తం 63 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికయ్యారు. ఏపీ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలో 90 అభ్యర్థుల ఎంపిక కాగా 70 విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీల భర్తీకి గాను రెండో జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు జులై 24, 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. 


ఎంపిక జాబాతా కోసం క్లిక్ చేయండి..


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21న నోటిఫికేషన్ వెలువడింది. 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత, ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థుల నుంచి అక్టోబరు 29 నుంచి నవంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20న రాతపరీక్ష నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తొలిజాబితాను ఫిబ్రవరి 23న విడుదల చేశారు. మొత్తం 135 ఉద్యోగాలకుగాను 133 మందిని ప్రాథమికంగా ఉద్యోగాలకు ఎంపికచేశారు. వీరిలో 90 మందికి నియామకపత్రాలు అందజేయగా.. 70 మాత్రమే విధుల్లో చేరారు. మిగిలిన పోస్టుల భర్తీకి తాజాగా రెండో జాబితాలను అధికారులు విడుదల చేశారు. 


ALSO READ:


గురుకుల నియామ‌క పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో గురుకుల నియామ‌క ప‌రీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగ‌స్టు 1 నుంచి 22 వ‌ర‌కు కంప్యూట‌ర్ ఆధారిత రాత ప‌రీక్షలు జరగాల్సి ఉండగా.. ఆగస్టు 23 వరకు నిర్వహించనున్నారు. ఈ ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 24న విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది.
పరీక్షల కొత్త షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial