వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు జులై 21 , 22 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవయసాయ విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు బుధవారం (జులై 19) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికిగాను రెండేళ్ల వ్యవసాయ, సేంద్రీయ డిప్లొమా కోర్సుతోపాటు మూడేళ్ల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం. వెంకటరమణ తెలిపారు. షెడ్యూల్‌ను చూసి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.


హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. జులై 21న 417 ర్యాంకు నుంచి 44823 ర్యాంకు వరకు, జులై 45043 ర్యాంకు నుంచి 80565 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పాలిసెట్‌-2023 ర్యాంకులు, రిజర్వేషన్‌ నిబంధనల మేరకు సీట్లను కేటాయించనున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. 


వివరాలు..


* అగ్రికల్చర్ డిప్లొమా ప్రవేశాలు - రెండో విడత కౌన్సెలింగ్


కోర్సులు..


1) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్


వ్యవధి: 2 సంవత్సరాలు.


2) డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్


వ్యవధి: 2 సంవత్సరాలు.


3) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్.


వ్యవధి: 3 సంవత్సరాలు.


అర్హత: పాలిసెట్-2023 ఉత్తీర్ణత ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: పాలిసెట్‌-2023 ర్యాంకులు, రిజర్వేషన్‌ నిబంధనల మేరకు 


కౌన్సెలింగ్ వేదిక: University Auditorium,
                               PJTSAU Campus, Rajendranagar, Hyderabad.


కౌన్సెలింగ్ తేదీ, సమయం: జులై 21 , 22 తేదీల్లో, ఉదయం 9.30 నుంచి ప్రారంభం.


ఈ సర్టిఫికేట్లు అవసరం..


➥ పదోతరగతి మార్కుల మెమో లేదా తత్సమాన సర్టిఫికేట్. 


➥ తెలంగాణ పాలిసెట్-2023 ర్యాంకు కార్డు, పాలిసెట్ హాల్‌టికెట్. 


➥ 4 నుంచి 10వ తరగతి వరకు బోనఫైడ్/స్టడీ సర్టిఫికేట్లు 


➥ నాన్-మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్.


➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) 


➥ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ (ఏపీ తెలంగాణ & ఏపీ) 


➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ


➥ EWS సర్టిఫికేట్ (2023-24) 


Counselling Notification


Seat Availability Details


Website


ALSO READ:


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి జులై 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి దశలో ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు  యూనివర్సిటీ & ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీల కాలేజీలలో కన్వీనర్ కోటా కింద ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. 
ఏపీఈఏపీసెట్ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్‌–2 (బీఆర్క్‌)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial