ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 25 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మిగతా 6 పోస్టులు ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నవంబరు 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
* సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్): 31 పోస్టులు
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.11.2022 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: రూ.77840 - రూ.136520.
స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా కేంద్రం: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17.11.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.12.2022.
➥ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 29.12.2022 నుంచి 07.01.2023 వరకు.
➥ స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 07.01.2023.
➥ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల వెల్లడి: 21.01.2023.
➥ రాత పరీక్ష హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 24.02.2023.
➥ రాత పరీక్ష తేదీ (ఆఫ్‌లైన్): 05.03.2023, 06.03.2023.
➥ రాత పరీక్ష ఫలితాల ప్రకటన: 21.03.2023.
➥ మౌఖిక పరీక్ష ప్రారంభం: 10.04.2023.
➥ తుది ఫలితాల ప్రకటన: 28.04.2023.
:: Also Read ::
ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు - నోటిఫికేషన్లు, పోస్టుల పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు పూర్తి వివరాలు, నోటిఫికేషన్ల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..