ఆంధ్రప్రదేశ్‌లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌ -2) పోస్టుల భర్తీకి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్‌ వర్కర్లు, సూపర్‌వైజర్లతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల వారు సెప్టెంబర్‌ 12లోగా దరఖాస్తు కోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. రాష్ట్రంలోని 4 జోన్ల పరిధిలో కేటాయించే కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 18న రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబర్‌ 15 నుంచి 17 వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే కమిటీ పర్యవేక్షిస్తుంది. 

వివరాలు..

* ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌ -2) 

ఖాళీల సంఖ్య: 560.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు:

విశాఖ జోన్‌ - 76

ఒంగోలు జోన్‌ - 126

ఏలూరు జోన్‌ - 142

కర్నూలు జోన్‌ - 216

అర్హత: అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్‌ వర్కర్లు, సూపర్‌వైజర్లు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.09.2022.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 12.09.2022.

దరఖాస్తుల పరిశీలన: 13.09.2022, 14.09.2022 తేదీల్లో.

రాతపరీక్ష తేది: 18.09.2022.

పరీక్ష హాల్‌టికెట్లు: 15.09.2022 - 17.09.2022 వరకు



Notification


Application


Website


 


Also Read:


AP Recruitment: నంద్యాలలో అంగన్‌వాడీ ఉద్యోగాలు,అర్హతలివే!
నంద్యాల, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమం దాని పరిధిలోని 8 ఐసిడియస్ ప్రాజెక్ట్‌లలో ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా ప్రధాన అంగన్‌వాడీ వర్కర్, మినీ వర్కర్, అంగన్‌వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన స్త్రీ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైనులో దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


Vims Recruitment: విమ్స్‌లో 69 పారా మెడికల్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఒప్పంద, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సరైన అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు
AP DSC Notification: ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్  ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించి, ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..