AP TET (ఆగస్టు)-2022 పరీక్షల ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఏపీటెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు చెక్ చేసుకొని మార్కులపై ఓ అంచనాకు రావచ్చు. AP TET ఆన్సర్ కీ లింక్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆన్సర్ కీని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.



ఏపీలో ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష జరగనుంది. ఏపీతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఒడిశాలో పరీక్షా కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహించారు.



Also Read: TSPSC Recruitment: ములుగు ఫారెస్ట్ కాలేజీలో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!



ఆన్సర్ కీ ఇలా చూసుకోండి..


Step 1: ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.  


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Candidate Login' టాబ్ మీద క్లిక్ చేయాలి.


Step 3: అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు, వెరిఫికేషన్ కోడ్ వివరాలు సమర్పించాలి.


Step 4: AP TET 2022 ఆన్సర్ కీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.


Step 5: ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైతే ప్రింట్ తీసుకోవాలి.  


 


ఆన్సర్ కీ కోసం వెబ్‌సైట్: https://aptet.apcfss.in/


 


ఏపీటెట్ ఫలితాలను త్వరలోనే వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు వెల్లడించాక అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీటెట్ తుది కీని కూడా ఫలితాలతో పాటే వెల్లడించే అవకాశం ఉంది. ఏపీటెట్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీలోని ప్రభుత్వ, మండల పరిషత్, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతులకు, 6 నుంచి 8వ తరగతుల ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికవుతారు.



Also Read: AP DSC : 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ - ఏపీ సర్కార్ ప్రకటన !




టెట్‌లో ఓసీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు వస్తే అర్హత మార్కులుగా నిర్దారించారు. టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజ్‌ ఇవ్వనున్నారు.  ఈసారి టెట్ లో అర్హత సాధిస్తే అభ్యర్థులకు లైఫ్ లాంగ్ చెల్లుబాటు అయ్యేలా మార్పు చేశారు. ఆగస్టు 31వ తేదీన పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేస్తారు. సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించారు. సెప్టెంబరు 12న ఫైనల్ కీ, 14న రిజెల్ట్స్ విడుదల చేయనున్నారు. 


 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో AP TET 2022 పరీక్షకు దరఖాస్తులు స్వీకరించారు. జూన్ 16 నుంచి జులై 16 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించింది.  టెట్ దరఖాస్తు ఫీజుగా ఒక్కో పేపర్‌కు రూ.500 వసూలు చేశారు. 


 


40 శాతానికి సడలింపు: 
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉంటే బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తుంది. కానీ టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలని నిబంధన ఉంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నారని, ఈ అర్హత మార్కులను 40 శాతానికి సడలించారు. ఈ సడలింపు ఈ ఒక్కసారికే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో టెట్ కు 20% వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు 1 నుంచి 5వ తరగతుల బోధనకు పేపర్-1(A, B), ఆరో నుంచి ఎనిమిదో తరగతుల బోధనకు పేపర్-2 (A, B)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...