AP DSC :  ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్పీ, MPP స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ స్కూళ్లలో 15పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 81పోస్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, DSCలో TET మార్కులకు 20% వెయిటేజీ కల్పించారు. నేటి(ఆగస్టు 23) నుంచి సెప్టెంబర్‌ 17వరకు ఫీజు చెల్లింపు గడువుగా నిర్దేశించారు. ఈనెల 25-సెప్టెంబర్‌ 18వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్‌ 23 న పరీక్ష,నవంబర్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.


డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ


డీఎస్పీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ కేటించారు. ఫీజు చెల్లింపు గడువు  సెప్టెంబర్ 17 వరకు ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగ‌స్టు 23వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.ఎన్నికలకు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో వేల మంది నిరుద్యోగులు.. టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని చాలా సార్లు ప్రభుత్వం ప్రకటించింది. 


ఏపీ టెన్త్‌లో ఇక ఆరు పేపర్లే - సీబీఎస్‌ఈ పరీక్షా విధానం అమలుకు ఉత్తర్వులు !


ఆరు వేల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా లిమిటెడ్ డీఎస్సీనే ప్రకటన


 ‘‘రాష్ట్రంలో సుమారు 6 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన ఉండేలా చూస్తున్నాం. దీనికోసం 35-40 వేల స్కూల్‌ అసిస్టెంట్లు అవసరం ఉంది. ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించి.. అనంతరం ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం’’ అని ఓ సారి అసెంబ్లీకి మంత్రి స్వయంగా సమాధానం ఇచ్చారు. ఎంఈవో-2 పోస్టుల ఏర్పాటు కోసం ఇప్పటికే ఉన్న టీచర్‌ పోస్టులను రద్దు చేసి ఆ స్థానంలో వాటిని తీసుకు వస్తున్నారు.


భారమైన 'దూరవిద్య' - అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు డబుల్! 


జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగుల నిరసనలు


ప్రస్తుత ప్రభుత్వం స్కూళ్ల రేషనలైజేషన్ చేయడంతో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయంది. గత మూడేళ్లుగా ఎలాంటి టీచర్ రిక్రూట్‌మెంట్ చేయకపోయినా ఇప్పుడు అతి స్వల్ప మొత్తం పోస్టులతో లిమిటెడ్ డీఎస్సీ వేయడంతో అభ్యర్థుల్లోనూ అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీ ఏడాది జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. ఒకటి విడుదల చేసినా అందులో పోస్టులు పదుల సంఖ్యలోనే ఉండటంతో చాలా మంది ఆందోళనలకు దిగారు.