AP DSC Hall Ticket 2024: ఆంధ్రప్రదేశ్‌లో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 15 నుంచి ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ మార్చి 9న వెల్లడించనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5 నుంచే హాల్‌టికెట్లు అందుబాటులోకి రావాల్సి ఉండగా వాయిదా పడింది. డీఎస్సీ పరీక్షలకు సుమారు 3 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తదనంతరం ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఏపీ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ ఏపీ డీఎస్సీ 2024 హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి -apdsc.apcfss.in.
➥ అక్కడ హోంపేజీలో AP DSC 2024 Halltickets లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు నమోదుచేసి 'Submit' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ కంప్యూటర్ స్క్రీన్ మీద డీఎస్సీ పరీక్ష హాల్‌టికెట్లు దర్శనమిస్తాయి.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
➥ ప్రింట్ తీసుకొని పరీక్షలకు హాజరయ్యే రోజు తీసుకెళ్లాలి.
➥ హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది.
టెట్, డీఎస్సీ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు..
ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. మార్చ్ 15 వ తేది నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14 వ తేదీన వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్ లో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాదుల వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.