AP DSC 2024 SOCEITIES NOTIFICATION: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో 1534 ఖాళీలు ఉన్నాయి. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలల్లో 4566 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యాశాఖ వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి.

  

దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే ఫిబ్రవరి 21లోగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఆయాతేదీల్లో మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తదనంతరం మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇక ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

వివరాలు..

* ఏపీ డీఎస్సీ (TRT) నోటిఫికేషన్ -  2024

➥ ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్/బీసీ వెల్ఫేర్/ ఎస్సీ వెల్ఫేర్/ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ (గురుకులం) పోస్టులు

ఖాళీల సంఖ్య: 1534 ఖాళీలు

1) ఏపీ మోడల్ స్కూల్స్: 287 పోస్టులు 

➥ ప్రిన్సిపల్: 15 పోస్టులు

➥ టీజీటీ: 248 పోస్టులు

➥ పీజీటీ: 23 పోస్టులు

2) ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్: 175 పోస్టులు 

➥ ప్రిన్సిపల్: 04 పోస్టులు

➥ టీజీటీ: 118 పోస్టులు

➥ పీజీటీ: 53 పోస్టులు

3) ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్: 170 పోస్టులు 

➥ ప్రిన్సిపల్: 23 పోస్టులు

➥ టీజీటీ: 66 పోస్టులు

➥ పీజీటీ: 81 పోస్టులు

4) ఏపీ ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్: 386 పోస్టులు 

➥ టీజీటీ: 386 పోస్టులు

5) ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ (గురుకులం): 517 పోస్టులు 

➥ టీజీటీ: 446 పోస్టులు

➥ పీజీటీ: 58 పోస్టులు

➥ ఫిజికల్ డైరెక్టర్: 13 పోస్టులు

అర్హతలు..

➥ ప్రిన్సిపల్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ లేదా రెండేళ్ల ఇంటిగ్రేడెట్ పీజీ కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. నిర్ణీత అనుభవం తప్పనిసరి.

➥ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులకు 50 శాతం మార్కులతో సంబంధి విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. దీంతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. 

➥ ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు 50 శాతం మార్కులతో సంబంధి విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.

➥ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు బీపీఈడీ లేదా ఎంపీఈడీ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

➙ ఓసీ అభ్యర్థులు 01.07.1980 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

➙ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 01.07.1975 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

➙ దివ్యాంగులు 01.07.1970 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (డీఎస్సీ) ద్వారా. 

రాతపరీక్ష విధానం: ప్రిన్సిపల్, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇట టీజీటీ పోస్టులకు సంబంధించి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్టీ)కు 80 మార్కులు, ఏపీటెట్‌కు 20 మార్కులు కేటాయించారు.

ముఖ్యమైన తేదీలు..

విషయం తేదీ
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 12.02.2024.
ఫీజుచెల్లింపు తేదీలు 12.02.2024 - 21.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 22.02.2024.
ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో 24.02.2024.
పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ 05.03.2024 నుంచి.
ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: 
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్)
ప్రిలిమినరీ ఆన్సర్ కీ వెల్లడి 31.03.2024.
ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ 31.03.2024 నుంచి 03.04.2024 వరకు.
ఫైనల్ కీ వెల్లడి 08.04.2024
డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి 15.04.2024 

DSC 2024 Societies Notification

DSC 2024 Societies Information Bulliten

Online Application