Komatireddy Rajagopal Reddy: 'హరీష్ రావు కాంగ్రెస్ లోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం' - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కష్టజీవి అని.. ఆయన కాంగ్రెస్ లోకి వస్తే తీసుకుంటామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

Komatireddy RajagopalReddy Offers Minister Post to HarishRao: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ లోకి వస్తే తీసుకుంటామని అన్నారు. 'నల్గొండలో బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాప్ అవుతుంది. ప్రజలు బీఆర్ఎస్ ను ఇంత తొందరగా నమ్మరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కష్టజీవి. ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్తు లేదు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లో చేరితే ఆయన్ను చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవి ఇచ్చి దేవాదాయ శాఖను అప్పగిస్తాం. గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో చేసిన పాపాలు కడుక్కోవడానికి హరీష్ రావుకు దేవాదాయ శాఖ మంచి అవకాశం. గతంలో మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను వాళ్లు తీసుకోలేదా.?. వన్ ధర్ఢ్ ఒకేసారి 26 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు రావాలి.' అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు, కడియం శ్రీహరిలా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదని.. తాము పదవుల కోసం చూసే వాళ్లం కాదని అన్నారు. ప్రజల కోసం అండగా ఉంటామని.. ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర మాదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చీలిక తీసుకురావాలని చూస్తోందని.. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. 'గతంలో మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత మాపై పడింది. బీఆర్ఎస్ నల్గొండ సభకు జనం వచ్చే అవకాశమే లేదు. కేటీఆర్ కు దమ్ముంటే పార్టీని నడపాలి. హరీష్ రావు కష్టపడినా ఆ పార్టీలో భవిష్యత్తు లేదు.' అని పేర్కొన్నారు.

Continues below advertisement

Also Read: Telangana Assembly: హరీష్ రావు Vs కోమటిరెడ్డి బ్రదర్స్ - తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

Continues below advertisement