Asistant Professors: ఏపీ మెడికల్ కాలేజీల్లో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ - సూపర్ స్పెషాలిటీస్ పోస్టులు, వాక్‌ఇన్ ఎప్పుడంటే?

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

Assistant Professors in Super Specialities: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. నాన్-లోకల్ అభ్యర్థులు అనర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Continues below advertisement

వివరాలు..

* అసిస్టెంట్ ప్రొఫెసర్ - సూపర్ స్పెషాలిటీస్ 

ఖాళీల సంఖ్య: 169 పోస్టులు

స్పెషాలిటీలు: కార్డియాలజీ, సీటీవీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, మెడికల్ అంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, న్యూక్లియర్ మెడిసిన్.

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 50 సంవత్సరాలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం: 7వ యూజీసీ పే స్కేలు ప్రకారం చెల్లిస్తారు. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఇతర భత్యాల కింద అదనంగా రూ.30,000 చెల్లిస్తారు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేది: 06.02.2024.

సమయం:  ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు.

వాక్ఇన్ వేదిక: O/o Director of Medical Education, 
                       Old GGH Campus, Hanuman Peta, Vijayawada.

దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..

➥ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి సర్టిఫికేట్ కాపీ.

➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్. తెలంగాణలో 4 నుంచి 10వ తరగతి చదివి విభజన తర్వాత ఏపీకి వలస వచ్చినట్లయితే రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి.

➥ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్.

➥ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్.

➥ పీజీ డిగ్రీ సర్టిఫికేట్/సూపర్-స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్.

➥ పీజీ డిగ్రీ మార్కుల మెమో/సూపర్-స్పెషాలిటీ డిగ్రీ మార్కుల మెమో.

➥ సీనియర్ రెసిడెన్సీ (SR) పూర్తి సర్టిఫికేట్.

➥ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.

➥ దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).

➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.

➥ మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు(స్పోర్ట్స్ కోటా కింద).

➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు. 

Notification

Website

ALSO READ:

🔰  ఏపీ మెడికల్ కాలేజీల్లో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

🔰 తెలంగాణ జెన్‌కోలో డైరెక్టర్ పోస్టులు - ఎంపికైతే నెలకు రూ.1.5 లక్షల జీతం

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola