అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.


హైకోర్టులో 241 పోస్టుల్లో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే ఉన్నాయి. ఇక మిగతా పోస్టుల్లో 36-టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు; 27-అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టులు ఉండగా.. మిగతావి ఓవర్ సీర్, అసిస్టెంట్ ఓవర్ సీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ పోస్టలు ఉన్నాయి.


ఇక జిల్లా కోర్టుల ఖాళీలను పరిశీలిస్తే.. ప్రకటించిన 3432 పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్-1520, జూనియర్ అసిస్టెంట్-681, ప్రాసెస్‌ సర్వర్-439, కాపీయిస్ట్-209, టైపిస్ట్-170, ఫీల్డ్ అసిస్టెంట్-158, ఎగ్జామినర్-112, స్టెనోగ్రాఫర్-114 పోస్టులు ఉండగా.. మిగతావి రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకీ అక్టోబరు 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 11 వరకు గడువు ఉంది. ఇక హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నవంబరు 4 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.800 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.


ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..


ఏపీ జిల్లా కోర్టుల్లో 681 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.


ఏపీ జిల్లా కోర్టుల్లో 158 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.


ఏపీ జిల్లా కోర్టుల్లో 439 ప్రాసెస్ సర్వర్ పోస్టులు, టెన్త్ అర్హత చాలు!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.


ఏపీ జిల్లా కోర్టుల్లో 114 స్టెనోగ్రాఫర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-3) ఉద్యోగాల భర్తీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతోపాటు టైప్-రైటింగ్ (హయ్యర్ గ్రేడ్) టెక్నికల్ ఎగ్జామినేషన్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, జిల్లాలవారీగా ఖాళీలివే!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.


ఏపీ జిల్లా కోర్టుల్లో 112 ఎగ్జామినర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ఏపీ జిల్లా కోర్టుల్లో 170 టైపిస్ట్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో టైపిస్ట్ పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతోపాటు టైప్-రైటింగ్ (హయ్యర్ గ్రేడ్) టెక్నికల్ ఎగ్జామినేషన్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ఏపీ జిల్లా కోర్టుల్లో 209 కాపీయిస్ట్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టైప్-రైటింగ్ (హయ్యర్ గ్రేడ్) ఎగ్జామ్ అర్హత ఉండాలి. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టులు, లైసెన్స్ తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టుల భర్తీకి  7వ తరగతి ఉత్తీర్ణత ఉండి లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా దరఖాస్తుకు అర్హులు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ఏపీ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


:: Also Read ::   ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు - నోటిఫికేషన్లు, పోస్టుల పూర్తి వివరాలు ఇవే!