APSDPS Recruitment: ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్‌డీపీఎస్) ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న  స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మేంట్ యూనిట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటి/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలుగల వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు..


* స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మేంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్


ఖాళీల సంఖ్య: 24 పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


అనుభవం: 3 సంవత్సరాలు. 


వయోపరిమితి: 01.01.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతం: నెలకు రూ.60,000.


పని ప్రదేశం: విజయవాడ.


నిర్వర్తించాల్సి బాధ్యతలు..



  • షెడ్యూలింగ్ అండ్ కోఆర్డినేషన్.

  • కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్.

  • బ్రీఫింగ్ అండ్ డాక్యుమెంటేషన్.

  • ఈవెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్.

  • స్టేక్ హోల్డర్ ఎంగేజ్‌మెంట్.

  • ట్రావేల్ అండ్ లాగిస్టిక్స్.

  • ఆఫీస్ మేనేజ్‌మెంట్.


కావాలసిన నైపుణ్యాలు: 



  • ఎక్స్‌లెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాలి.

  • ఎంఎస్ ఆఫీస్(పవర్ పాయింట్, వర్డ్, ఎక్సల్) జ్ఞానం అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ టూల్స్.

  • ఇంగ్లిష్, తెలుగు భాషలపై పట్టు ఉండాలి. అనర్గళంగా రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. 

  • నిర్ణీత గడువులోగా ఇచ్చిన పనిని పూర్తిచేయగలగాలి. ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగలగాలి.

  • నాయకత్వ లక్షణాలతోపాటు టీమ్ మేనేజ్‌మెంట్ విభాగంలో అవగాహన ఉండాలి. 


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.09.2024.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.09.2024. 5 PM.


Notification


Online Application


Website


ALSO READ:


సింగరేణిలో మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు 1.25 లక్షల జీతం


తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఎంపికైతే రూ.96 వేల వరకు జీతం


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...