Anganwadi Vacancies: అన్నమయ్య జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 116 పోస్టులు ఉండగా అందులో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 11, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 12, అంగన్వాడీ సహాయకుల పోస్టులు 93 ఖాళీగా ఉన్నాయి. డిసెంబర్‌ 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకాగా జనవరి 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌, ఇతర వివరాల కోసం ఆన్‌లైన్‌ లేదా సంబంధిత ప్రాజెక్టు కార్యాలయం నోటీసు బోర్డులో చూసుకోవాల్సి ఉంటుంది. బి.కొత్తకోట, చిట్వేల్‌, ఎల్‌ఆర్‌ పల్లి, మదనపల్లి, పీలేర్‌, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, టి.సండుపల్లి, తంబలపల్లి, వాల్మీకిపురం ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 116 


పోస్టుల వారీగా ఖాళీలు..


✦ అంగన్వాడీ కార్యకర్త(AWW): 11 పోస్టులు


✦ అంగన్వాడీ సహాయికురాలు(AWH): 93 పోస్టులు


✦ మినీ అంగన్వాడీ కార్యకర్త(Mini AWW): 12 పోస్టులు


అర్హత: అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి స్థానికంగా నివసిస్తున్న వివాహిత మ‌హిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 01.07.2024 తేదీ నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. బ‌యోడేటాతో పాటు విద్యార్హతలు, ఇత‌ర స‌ర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల‌పై గెజిటెడ్ ఆఫీస‌ర్‌తో అటెస్టేష‌న్ చేయించి దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. 


ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత ప‌రీక్ష లేదు.


జీతం: నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్డీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.


నోట్: ఎస్సీ/ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి 21 సంవత్సరములు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనపుడు 18 సంవత్సరముల వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు. (18 నుంచి 35 సంవత్సరాలు).


దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్‌లు..


➥ 10వ తరగతి పాస్ సర్టిఫాకేట్..


➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ(మైనర్ లోకోమోటర్) సర్టిఫికేట్‌లు..


➥ ఓసీ కేటగిరి పోస్టులకు ఓసీ సర్టిఫికేట్‌..


➥ లోకల్ సర్టిఫికేట్..


➥ మీ సేవ ద్వారా జారీచేయబడిన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్ మొదలైన సర్టిఫికేట్‌లు..


ముఖ్యమైన తేదీలు..


🔰 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.12.2024.


🔰 దరఖాస్తుకు చివరి తేదీ: 02.01.2025.


Notification


Website


ALSO READ:
నేషనల్ అల్యూమినియం కంపెనీలో నాన్ - ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు జనవరి 21లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...