Andhra Pradesh police constable Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించి పోలీస్ కానిసేబుల్ రిక్రూట్‌మెంట్ ఫలితాలను హోంమంత్రి అనిత విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీహరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఫలితాలను ఎలా చూడాలి
ఈ మధ్య నిర్వహించిన ఏపీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspxలో ఉంచారు. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspxలోకి వెళ్లాలి.
అక్కడ మీ హాల్‌టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
తర్వాత సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేయాలి.
అలా చేసిన వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
2022 అక్టోబరులో కానిస్టేబుల్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6024 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు 2023 జనవరిలో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించారు. వివిధ న్యాయపరమైన పాలనాపరమైన అడ్డంకులు దాటుకొని ఇన్నాళ్లకు ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.
టాపర్లుగా నిలిచిన వారి పేర్లు
- గండి నానాజీ(విశాఖ)
- గొర్లి రమ్య మాధుర్(విజయనగరం)
- మేరుగ అచ్యుత రావు(రాజమండ్రి )
6100 పోస్టుల భర్తీతో విడుదలైన నోటిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వారికి ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహించారు. దీనికి నాలుగున్నర లక్షల మంది హాజరయ్యారు. వారిలో 40 వేల మంది వరకు అర్హత సాధించి దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వారిలో తర్వాత దశ పరీక్షకు కేవలం 33వేల మంది మాత్రమే అర్హత సాధించారు. వారిలో 29వేల మంది పురుషులు అయితే మిగతా వాళ్లు మహిళా అభ్యర్థులు. ఫైనల్ పరీక్షలో వారి సాధించిన మార్కులు తెలుసుకునేందుకు ఈ మధ్య OMR షీట్‌లను కూడా ఆన్‌లైన్‌లో పెట్టారు అధికారులు. ఇప్పుడు ఫైనల్ ఫలితాలను విడుదల చేశారు.
ఉద్యోగం సాధించిన వారికి జీతభత్యాలు ఎంత?
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం పొందిన కానిస్టేబుళ్లకు 21, 700 నుంచి 69 వేల వరకు జీతం పొంద వచ్చు. గ్రాస్ శాలరీ 30 వేల నుంచి 40 వేల వరకు ఉంటుంది. దీనికి డీఏలు, హెచ్‌ఆర్‌ఏలు, టీఏలు అధనంగా ఉంటాయి.