AP Mega DSC 2025 Call Letters: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీకి సంబంధించిన మరో అడుగు ముందుకు పడింది. అభ్యర్థుల కాల్‌లెటర్స్‌ను వెబ్‌సైట్‌లో రాత్రి 9 గంటల తర్వాత పెట్టిందని సమాచారం. వ్యక్తిగతంగా లాగిన్ అయిన తర్వాత కాల్‌లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో వాటిని సబ్‌మిట్ చేయాలి. 
 
ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీకి సంబంధించిన ఆఫర్ లెటర్స్‌ను వెబ్‌సైట్‌లో రాత్రి 9 గంటల తర్వాత పాఠశాల విద్యాశాఖ ఉంచినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన మెరిట్ లిస్ట్ ఆధారంగా టాప్‌లో ఉన్న అభ్యర్థులకు కాల్‌లెటర్స్ పంపించారు. రిజర్వేషన్లు, ఇతర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆఫర్‌ లెటర్స్ ఇష్యూ  చేశారు. మంగళవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా మొదలు కానుంది.

Continues below advertisement


ఏపీ మెగా డీఎస్సీ రాత పరీక్షలో మంచి మార్కులతో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్లు తమకు ఇచ్చిన పాస్‌ వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్‌ తో లాగిన్ అయిన తర్వాత కాల్‌లెటర్స్‌ చూసుకోవచ్చు. అందులో ఏ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఏ కేటగిరిలో ఎంపికయ్యారు. ఎప్పుడు సర్టిఫికెట్ వెరిఫకేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ కోసం ఏం తెచ్చుకోవాలనే విషయాలు స్పష్టంగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చదివి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. వాటిని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను అధికారులు సూచించిన తేదీన జిల్లా అధికారుల వద్దకు వెళ్లి చూపించాల్సి ఉంటుంది. 


ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన కాల్‌లెటర్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?


డీఎస్సీలో మంచి మార్కులు, ర్యాంకు వచ్చిన వాళ్లకు కాల్‌లెటర్‌తోపాటు మెసేజ్ కూడా పంపిస్తున్నారు. అలా మెసేజ్ వచ్చిన వాళ్లు, అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి కాల్‌లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 


స్టెప్‌-1 అధికారిక వెప్‌సైట్‌ https://cse.ap.gov.in/dsc/లోకి వెళ్లాలి


స్టెప్‌-2 క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 


స్టెప్‌-3 మీకు రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్,క్యాప్చా కోడ్‌తో లాగిన్ అవ్వాలి. 


స్టెప్-4 మీ పేజ్‌లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్‌సైడ్‌లో సర్వీసెస్ అని ఉంటుంది. దానిపై క్లికే చేయాలి. 


స్టెప్‌-5 అందులో మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పటి నుంచి మీకు వచ్చిన కాల్‌లెటర్ వరకు అన్నీ ఉంటాయి. 


స్టెప్‌-6 అక్కడ ఉండే కాల్‌లెటర్‌ను డౌన్‌లౌడ్ చేసుకొని ప్రింట్‌ తీసి పెట్టుకోవాలి. రేపు మీరు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ టైంలో చూపించాల్సి ఉంటుంది. 


ఇలా డౌన్ లోడ్ చేసిన కాల్‌లెటర్‌తోపాటు మీ క్వాలిఫికేషన్, కేటగిరికి సంబంధించిన సర్టిఫికెట్స్‌, ఇతర సర్టిఫికెట్స్‌ అన్నీకూడా అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీకు ఓ డేట్ చెప్పి అప్పుడు ఒరిజినల్‌సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.