ఏపీ హైకోర్టులో డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 7వ తరగతి ఉత్తీర్ణత ఉండి లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* డ్రైవర్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 08
అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణత ఉండి లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా దరఖాస్తుకు అర్హులు.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
జీతం: రూ.23,780 - రూ.76,730.
రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కోప్రశ్నలకు ఒకమార్కు ఉంటుంది. వీటిలో జనరల్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-10 ప్రశ్నలు-10 మార్కులు, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో కటాఫ్ మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారిలో 1 : 3 నిష్పత్తిలో డ్రైవింగ్ (స్కిల్ టెస్ట్) టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:15.11.2012.
:: ఇవీ చదవండి ::
‘రోజ్‌గార్ మేళా’ ప్రారంభించిన ప్రధాని మోదీ, 75 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు!
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అక్టోబరు 22న 'రోజ్ గార్ మేళా' డ్రైవ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
DAE Recruitment: భారత అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు - డిగ్రీ, డిప్లొమా అర్హతలు!
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ స్టోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ రీజినల్ యూనిట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కానిస్టేబుల్, ఎస్‌ఐ 'పార్ట్-2' దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?
తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలమినరీ రాతపరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పార్ట్-2 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అక్టోబరు 27న ఉదయం 8 నుంచి నవంబరు 10 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించబోమని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పలువురు అర్హత సాధించిన నేపథ్యంలో దాదాపు 2.69 లక్షల మంది పార్ట్-2 దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని మండలి వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ అనంతరం పీఎంటీ, పీఈటీల వేదికలు, తేదీల గురించి అభ్యర్థులకు వెబ్‌సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్లు పంపించనన్నుట్లు తెలిపాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...