హైదారాబాద్‌లోని అమెజాన్ సంస్థ సిస్టమ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
★ సిస్టమ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ II
అర్హత: బీఎస్/ఎమ్‌ఎస్ డిగ్రీ.
అనుభవం: 2 - 4 సంవత్సరాలు.
పనిప్రదేశం: హైదారాబాద్.
స్కిల్స్:
1. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథం డిజైన్‌లో కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్‌తో పాటు సమస్య పరిష్కారం చేయగలగాలి.
2. యూనిక్స్ బేస్ ఓ/ఎస్ అనుభవం లేదా లినక్స్‌ని త్వరగా తీయగల సామర్థ్యం ఉండాలి
3. ప్రోగ్రామింగ్ భాషలు జావా లేదా సీ++ లేదా సీ కనీసం ఒకదానిలో ఇంటర్మీడియట్ నుండి అధునాతన నైపుణ్యం ఉండాలి.
4. ప్రోగ్రామింగ్ భాషలు: రూబీ, పైథాన్, పెర్ల్ లేదా జావా కనీసం ఒకదానిలో ఇంటర్మీడియట్ నుండి అధునాతన నైపుణ్యం ఉండాలి.
5. క్లిష్టమైన ఎస్‌క్యూఎల్ ప్రశ్నలను వ్రాయగల సామర్థ్యం ఉండాలి.
6. డీబగ్గింగ్/ట్రబుల్‌షూటింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
7. రిలేషనల్ మరియు ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డేటాబేస్ టెక్నాలజీలపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
8. పంపిణీ చేయబడిన సిస్టమ్‌లు మరియు/లేదా పెద్ద-స్థాయి వెబ్ అప్లికేషన్లతో పనిచేసిన అనుభవం ఉండాలి.
9. నెట్‌వర్కింగ్ ఫండమెంటల్స్‌పై గట్టి పట్టుతో పాటు బ్యాలెన్సర్‌లు, స్విచ్‌లు, రౌటర్లపై అనుభవం ఉండాలి.
10. డీఎన్ఎస్, డీహెచ్‌సీపీ, ఎస్‌ఎస్‌హెచ్, హెచ్‌టీటీపీ, టీసీపీ/ఐపీ,నెట్‌వర్క్ ప్రోటోకాల్ మరియు ఇతర సాధారణ విషయాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
Notification&Online Application
Also Read:
DOT: టెలికమ్యూనికేషన్ శాఖలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలు ఉండాలి!
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌లో ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15000 ఇంటర్న్‌షిప్‌గా ఇస్తారు. ఇంటర్నిషిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!
ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 14లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!
భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ స్టాండర్డ్స్, ప్యారామీటర్స్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..