ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఒకప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలు (ఫేజ్-3) ఉండటంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు కమిషన్ పేర్కొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వేయాలని నిర్ణయించింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్ 1 పరీక్ష రాస్తున్న 25 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. ఈ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అధికారులు మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు.
గ్రూప్-4 మెయిన్స్ హాల్‌టికెట్లు అందుబాటులో..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గ్రూప్-4 ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ మార్చి 24న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏప్రిల్ 4న ప్రధాన పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ప్రధాన పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా స్క్రీనింగ్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.
ఏపీ రెవెన్యూ విభాగంలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గత ఏడాది జులై 31న ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో మొత్తం 1494 మంది అభ్యర్థులు బుక్‌లెట్ సిరీస్ సరిగా వేయకపోవడం, ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తించడం లాంటి కారణాల వల్ల అనర్హతకు గురయ్యారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఆన్‌లైన్ విధానంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
గ్రూప్-4 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
Also Read:
యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ), ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ)లో ప్రవేశాల కోసం నిర్వహించునున్న రాతపరీక్ష అడ్మిట్ కార్డుల(హాల్‌టికెట్ల)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(1)-2023 పరీక్ష అడ్మిట్‌కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సీడీఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు లేదా మరే ఇతర విధానాల్లోనూ అడ్మిట్‌కార్డు పొందలేరు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో సీడీఎస్ఈ-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..