రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 169 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 12న ప్రారంభమైంది. జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  


వివరాలు..


మొత్తం ఖాళీలు: 169


* సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు


విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, ప్రసూతి శాస్త్రం & గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యారాలజీ, పాథాలజీ, సైకాయాట్రీ తదితరాలు.


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. మహిళా,ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.


జీతభత్యాలు: నెలకు రూ.67700 చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.06.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 10.07.2023. 


Notification


Website


Also Read:


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ వైవా ద్వారా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..