న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ గ్రూప్ ఎ(నాన్-ఫ్యాకల్టీ), బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబరు 19లోగా ఆన్‌లైన్‌లో దరకాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
★ గ్రూప్ ఎ(నాన్-ఫ్యాకల్టీ), బి, సి పోస్టులు
పోస్టుల సంఖ్య: 254
పోస్టు | ఖాళీల సంఖ్య |
సైంటిస్ట్-1 | 03 |
సైంటిస్ట్-2 | 05 |
క్లినికల్ సైకాలజిస్ట్/ సైకాలజిస్ట్ | 01 |
మెడికల్ ఫిజిసిస్ట్ | 04 |
అసిస్టెంట్ బ్లడ్/ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్ | 04 |
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ | 10 |
ప్రోగ్రామర్ | 03 |
పెర్ఫ్యూషనిస్ట్ | 01 |
అసిస్టెంట్ డైటీషియన్ | 05 |
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-2 | 10 |
జూనియర్ ఫిజియోథెరపిస్ట్/ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ | 05 |
స్టోర్ కీపర్ (డ్రగ్స్/ జనరల్) | 12 |
జూనియర్ ఇంజినీర్ (ఎసీ & రెఫ్రిజరేటర్) | 08 |
టెక్నీషియన్ (రేడియో థెరపీ) | 03 |
స్టాటిస్టికల్ అసిస్టెంట్ | 02 |
ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ గ్రేడ్-1 | 03 |
టెక్నీషియన్ (రేడియాలజీ) | 12 |
జూనియర్ ఫొటోగ్రాఫర్ | 03 |
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ | 44 |
శానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-2 | 04 |
న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ | 01 |
స్టెనోగ్రాఫర్ | 14 |
డెంటల్ టెక్నీషియన్ గ్రేడ్-2 | 03 |
అసిస్టెంట్ వార్డెన్ | 01 |
సెక్యూరిటీ- ఫైర్ గార్డ్ గ్రేడ్-2 | 35 |
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ | 40 |
మొత్తం ఖాళీలు | 254 |
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:రూ.3000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2400).
ఎంపిక ప్రక్రియ: పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➽ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 19.11.2022
➽ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:19.12.2022
::Also Read::
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
వాక్ ఇన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
విజయనగరం జిల్లాలో సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, దరఖాస్తుచేసుకోండి!
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము ఎన్టీఈపీ ప్రొగ్రామ్‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు తమ ధరఖాస్తులను జిల్లా క్షయ నివారణా అధికారి కార్యాలయం, విజయనగరం వారికి నవంబరు 17 సా.4గం లోపు సమర్పించవలెను.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..