పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని 13 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో 2022 ఆగస్టులో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుకుల సంబంధించిన వార్షిక పరీక్షల ఫలితాలను నవంబరు 13న అధికారులు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి 2020-21 బ్యాచ్, 2021-22 బ్యాచ్ పరీక్ష ఫలితాలు.. అలాగే డిప్లొమా కోర్సులకు సంబంధించి 2020-21 బ్యాచ్, 2021-22 బ్యాచ్ పరీక్ష ఫలితాలను అందుబాటులో ఉంచారు. కోర్సులవారీగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను విడుదల చేశారు. వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. 


Certificate-Results-2020-21 Batch   


Certificate-Results-2021-22 Batch


Diploma-Results-2020-21 Batch      


Diploma-Results-2021-22 Batch


 


:: Also Read ::


ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో బీటెక్‌, బీఎస్సీ స్పాట్ ప్రవేశాలు - 15న కౌన్సెలింగ్!
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఎంపీసీ స్ట్రీమ్ కింద బీటెక్, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు వాక్ ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌లోని వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 15న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

వివరాలు.. 


1) కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, కంది, సంగారెడ్డి జిల్లా 

2) కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్ జిల్లా.
3) కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, సైఫాబాద్, హైదరాబాద్.


అర్హత: ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఎంసెట్-2022 ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: ఎంసెట్ 2022 ర్యాంకు ఆధారంగా.


కౌన్సెలింగ్‌కు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే..
➽ పుట్టినతేది ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల ఒరిజినల్ మెమో 
➽ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతకు సంబంధించిన పాస్ సర్టిఫికేట్ కమ్ మార్కుల మెమో 
➽ తెలంగాణ ఎంసెట్ -2022 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు. 
➽ 6 - 12 తరగతి వరకు బోనఫైడ్/స్టడీ సర్టిఫికేట్.
➽ టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్). 
➽ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. 
➽ ఈ మధ్యే తీసుకున్న కులధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే).
➽ EWS సర్టిఫికేట్ 
➽ నాన్ -మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ (అవసరమైనవారికి మాత్రమే) 
➽ అగ్రికల్చరల్ ల్యాండ్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి మాత్రమే)


వాక్ఇన్ తేదీ, కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


UGC PhD Guidelines: విద్యార్థులకు గుడ్ న్యూస్, పీజీ లేకున్నా 'పీహెచ్‌డీ'లో చేరొచ్చు - ఎలాగంటే?
ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలు జారీచేసింది. దీనిప్రకారం విద్యార్థులకు పీజీ డిగ్రీతో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించనుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..