నాగ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 18లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.



వివరాలు..

టీచింగ్ ఫ్యాకల్టీలు

ఖాళీల సంఖ్య: 90


➥ అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 20 పోస్టులు


➥ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 70 పోస్టులు


విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెన్‌టిస్ట్రీ (ప్రొస్థొడాంటిస్ట్), డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ & మెటబాలిజం, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ(మెడికల్), జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ బయోటెక్నాలజీ, మెడికల్ హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ/ల్యాబ్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నసిస్, రేడియోగ్రఫీ, రుమటాలజీ & క్లినికల్ ఇమ్యూనాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్, ట్రామా & ఎమర్జెన్సీ, యూరాలజీ తదితరాలు.

➥ అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 20 పోస్టులు

అర్హత: పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్).

అనుభవం: 6 సంవత్సరాల టీచింగ్/రిసెర్చ్ అనుభవం ఉండాలి.

సూపర్ స్పెషాలిటీ విభాగం: డీఎం/ఎంసీహెచ్. 3-4 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 5 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

➥ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 70 పోస్టులు

అర్హత: పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్). హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఎండీ లేదా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. నాన్ మెడికల్ అభ్యర్థులు అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, మెడికల్ బయోటెక్నాలజీ, ఫార్మకాలజీ, ఫిజియోలజీ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత విభాగాలలో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అనుభవం: 3 సంవత్సరాల టీచింగ్/రిసెర్చ్ అనుభవం ఉండాలి.

సూపర్ స్పెషాలిటీ విభాగం: డీఎం/ఎంసీహెచ్. ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.


జీతం: అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,38,300 – రూ.2,09,200, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500 – రూ.1,67,400.


ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 18.11.2023.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Executive Director, 
AIIMS Nagpur, 
Administrative Block, Plot no.2, 
Sector-20, MIHAN, 
Nagpur – 441108


Notification


Application


Website


ALSO READ:


సీడాక్‌ బెంగళూరు‌లో 159 ఖాళీలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
బెంగళూరులోని 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌‌డ్ కంప్యూటింగ్(సీడాక్)'లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 159 ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్,  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..