AIIMS Kalyani conduct Walk-In-Interview: వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, నదియా జిల్లా, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపరికన వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఏయిమ్స్‌లో లేదా బయట జూనియర్ రెసిడెన్సీ (నాన్-అకడమిక్)లో ఇప్పటికే 2 సార్లు జూనియర్ రెసిడెన్సీ పూర్తి చేసిన అభ్యర్థులను పరిగణించరు. ఆర్మీ సేవలు, సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ & ప్రైవేట్ ప్రాక్టీస్‌లో అనుభవం జూనియర్ రెసిడెన్సీ (నాన్-అకడమిక్)కి సమానంగా పరిగణించబడుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 18న ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 36


* జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టులు


కేటగిరీ వారీగా: ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 13, ఎస్సీ- 14, ఎస్టీ- 07.


అర్హత: ఎన్‌ఎంసీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా ఏదైనా రాష్ట్ర వైద్య మండలి కింద ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్ అండ్ రిజిస్ట్రేషన్‌ను సమర్పించాలి. జూనియర్ రెసిడెన్సీ ప్రారంభ తేదీకి అంటే మార్చి 18..03.2025 నాటికి 03 సంవత్సరాల ముందు ఎంబీబీఎస్‌ (ఇంటర్న్‌షిప్‌తో సహా) ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.


వయోపరిమితి: 10.03.2025 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ లేని ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉండదు.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ఎస్టీ, ఇతర కమ్యూనిటీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులను పూర్తి చేసిన తర్వాత వాటికి ఒరిజినల్ డాక్యుమెంట్‌లను జతచేసి సంబంధిత చిరునామలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: రిపోర్టింగ్ ఆధారంగా, అభ్యర్థుల దరఖాస్తు అండ్ అవసరమైన డాక్యుమెంట్‌లను వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాక్-ఇన్-ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


జీతం: నెలకు రూ.15,600- రూ.39,100.


వేదిక: 
Administrative Building, Ground Floor, 
Welcome center of AIIMS, Kalyani, Pin -741245.


ముఖ్యమైన తేదీలు..


✦ రిపోర్టింగ్ తేదీ: 18.03.2025. 


✦ రిపోర్టింగ్ సమయం: ఉదయం 09.00 గంటలు.


✦ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ & సమయం: 18.03.2025. ఉదయం 09.30 గంటల నుంచి


✦ ఇంటర్వ్యూ తేదీ & సమయం*: 18.03.2025. 10.00 గంటల నుంచి


ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు..


➥ అభ్యర్థి ఇన్‌స్టిట్యూట్‌లో చేరే సమయంలో కింది ఒరిజినల్ డాక్యుమెంట్‌లు మరియు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలను తీసుకురావాలి.


➥ ఐడెంటిటీ ప్రూఫ్(పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, ఆధార్ కార్ట్ మొదలైనవి)


➥ అడ్రస్ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ మొదలైనవి)


➥ పుట్టిన తేదీని చూపే సర్టిఫికెట్ (10వ సర్టిఫికేట్/ బర్త్ సర్టిఫికేట్)


➥ రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.


➥ 10వ తరగతి & 12వ తరగతి సర్టిఫికెట్లు.


➥ ఎంబీబీఎస్‌ మార్క్ షీట్లు & సర్టిఫికెట్లు


➥ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్


➥ ఎంబీఈ (ఫారిన్ గ్రాడ్యుయేట్ కోసం) నిర్వహించిన FMGE సర్టిఫికేట్


➥ NMC/ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌‌లో నమోదు.


➥ ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికేట్ (ఇంటర్న్‌షిప్ పూర్తయిన కాపీ)


➥ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్ (ఓబీసీ*/ఎస్సీ/ఎస్టీ/పీహెచ్) (*అభ్యర్థులు ఓబీసీ యొక్క కేంద్ర జాబితాలోని నాన్ క్రీమీలేయర్ చెందినవారు అయి ఉండాలి).


➥ గవర్నమెంట్/ సెమీ-గవర్నమెంట్, పిఎస్‌యులలో పనిచేసే అభ్యర్థులు సరైన ఛానెల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సర్వీసుల్లో ఉన్న అభ్యర్థులు యజమాని నుంచి “నో అబ్జెక్షన్ సర్టిఫికేట్” కలిగి ఉండాలి. ఎంపికైన తర్వాత, ప్రభుత్వ / పిఎస్‌యులలో పనిచేసే అభ్యర్థులు రిలీవ్ ఆర్డర్‌ను సమర్పించాలి.


➥ ఆర్థోపెడిక్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ (OPH) సర్టిఫికేట్‌ను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు/సూచనల ద్వారా సక్రమంగా ఏర్పాటు చేయబడిన మెడికల్ బోర్డు జారీ చేయాలి.


➥ రిజర్వేషన్/వయో సడలింపు/ఫీజు మినహాయింపు  యొక్క ప్రయోజనాలను పొందాలనుకునే అభ్యర్థులందరూ వారి క్లెయిమ్‌కు మద్దతుగా సమర్థ అధికారి ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ కాపీని జతచేయాలి.


నోట్(*): జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌ అకడమిక్‌) పదవీకాలం 6 నెలలు మాత్రమే.. ఎవరైనా ఎప్పుడైనా చేరి నిష్క్రమిస్తే, పని వ్యవధితో సంబంధం లేకుండా అది ఒక పదవీకాలంగా లెక్కించబడుతుంది. ప్రతి పదవీకాలానికి, అభ్యర్థులు(అతను/ఆమే) తమ దరఖాస్తును విడిగా సమర్పించాలి.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..