సౌత్ క్వీన్ సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. ఆమె 'ఖుషి' మూవీ తర్వాత టాలీవుడ్ తెరపై మెరవలేదు. దీంతో సమంత టాలీవుడ్ లో చేయబోయే నెక్స్ట్ మూవీ కోసం ఆమె అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న వారికే ఈ గుడ్ న్యూస్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాలో సమంత కీ రోల్ పోషించబోతోందనేది ఆ వార్తల సారాంశం. 

Continues below advertisement


అనుపమ పరమేశ్వరన్ మూవీలో సమంత


అనుపమ పరమేశ్వరన్ చివరిసారిగా అశ్విన్ మారిముత్తు దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ 'డ్రాగన్' లో కనిపించింది. ఈ మూవీ దాదాపు 125 కోట్ల భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తన నెక్స్ట్ మూవీ 'పారద'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీకి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించగా, దర్శన రాజేంద్రన్ కీలకపాత్రను పోషిస్తున్నారు. మిస్టరీ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలను భారీగా పెంచింది. ఇక మూవీపై మరింత హైప్ పెంచేలా ఇందులో సమంత కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల ప్రకారం సమంత 'పరదా' సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతోంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, సమంత క్లైమాక్స్ లో కీలకమైన టైంలో తెరపై కనిపిస్తుందని అంటున్నారు. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.


రెండవసారి తెరపై సామ్, అనుపమ కాంబినేషన్ రిపీట్ 


'పరదా' సినిమాలో సమంత కూడా భాగం కాబోతుందని వస్తున్న వార్తలు గనక నిజమైతే... ఇద్దరు హీరోయిన్లు కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇదే. గతంలో వీరిద్దరూ 'అఆ' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించగా, సమంత మెయిన్ హీరోయిన్ గా కనిపించింది. అనుపమ పరమేశ్వరన్ మాత్రం నితిన్ ను ఇష్టపడే ఆయన మరదలుగా నటించింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పాత్ర ఉన్నది కాసేపే అయినప్పటికీ, గుర్తింపు మాత్రం బాగానే దక్కింది. మరి ఇప్పుడు సమంత 'పరదా' సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Also Read: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ


'పరదా' మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లో త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ 'డ్రాగన్' ఈనెల చివర్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరోవైపు సమంత 'రక్త్ బ్రహ్మాండ్' అనే సిరీస్ తో పాటు 'బంగారం' అనే మూవీ కూడా చేస్తోంది. మరి ఇప్పుడు సమంత 'పరదా' మూవీలో కీ రోల్ పోషిస్తుందనే వార్తలపై మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి.