గోరఖ్‌పూర్‌‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 121 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 121.


పోస్టుల వారీగా ఖాళీలు..


1. ప్రొఫెసర్: 27


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 14 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.


2. అడిషనల్ ప్రొఫెసర్: 19


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 10 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.


3. అసోసియేట్‌ ప్రొఫెసర్: 29


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 04 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.


4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్: 46


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత


పని అనుభవం: కనీసం 03 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.


విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్&ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, డెంటిస్ట్రీ, ENT, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్ట్ట్రిక్స్&గైనకాలజీ, ఆప్తామాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ/ల్యాబ్ మెడ్, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్, ఫిజియాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, ట్రామా &ఎమర్జెన్సీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడ్. & బ్లడ్ బ్యాంక్.


వయోపరిమితి: 50-58 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/దివ్యాంగులకు రూ.200.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: పోస్టును అనుసరించి నెలకు రూ.101500-రూ.168900 చెల్లిస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకి చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/రోజ్‌గర్ సమాచార్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.


Notification 


Website 



Also Read:


బీఎస్‌ఎఫ్‌లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు- వివరాలు ఇలా!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌) గ్రూప్-సి కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న వెబ్‌నోట్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..


తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 132 ఆర్ట్ టీచర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 22 వెలువడింది. దీనిద్వారా 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 16 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 6 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 72 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో  38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..