AIIMS Recruitment: దియోఘర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) జూనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఉద్యోగ ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 29 


* జూనియర్‌ రెసిడెంట్ పోస్టులు(నాన్‌ అకడమిక్‌).


అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.


వయోపరిమితి: 33 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: యూఆర్ అభ్యర్థులకు రూ. 3000; ఓబీసీ అభ్యర్థులకు రూ.1000.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ఇంటర్వ్యూ వేదిక: Administrative Block, Fourth Floor, AIIMS Devipur, Permanent Campus Deoghar -814152 (Jharkhand).


చిరునామా: Registrar Office, AIIMS Devipur, Permanent Campus, Deoghar- 814152 (Jharkhand).


దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.


Notification


Website


ALSO READ:


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 95 ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 07 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ECIL: ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 62 అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టులు
FDDI Recruitment: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, బీకామ్‌, బీఏ, బ్యాచిలర్స్‌డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..