AIIMS Bibinagar Recruitment: హైదరాబాద్‌ బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎండీ, ఎస్, డీఎం, ఎంసీహెచ్‌తోపాటు సంబంధిత విభాగంలో డీఎన్‌ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంసీఐ/ఎన్‌ఎంసీ/స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యత్వం తప్పనిసరిగా కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్‌ అభ్యర్థులు రూ.1770, ఈడబ్ల్యూఎస్‌ రూ.1416, చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుల ఆధారంగా రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: recruitment.aiimsbibinagar@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.


పోస్టుల వివరాలు.. 


* సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టులు


ఖాళీల సంఖ్య: 151.


విభాగాలవారీగా ఖాళీలు..
అనస్తీషియాలజీ-05, అనాటమీ-04, బయోకెమిస్ట్రీ-04, సీఎఫ్‌ఎం-06, డెన్‌టిస్ట్రీ-03, డెర్మటాలజీ-02, ఈఎన్‌టీ-04, ఎఫ్‌ఎంటీ-03, జనరల్ మెడిసిన్ & మెడికల్ సూపర్ స్పెషాలిటీస్-23, జనరల్ సర్జరీ & సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్-28, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-02, మైక్రోబయాలజీ-04, న్యూక్లియర్ మెడిసిన్-03, ఓబీజీ-06, ఆప్తాల్మాలజీ-04, ఆర్థోపెడిక్స్-04, పీడియాట్రిక్స్&నియోనటాలజీ-09, పాథాలజీ-04, ఫార్మకాలజీ-02, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్-02,  ఫిజియాలజీ-04, సైకియాట్రీ-04, పల్మొనరీ మెడిసిన్-02, రేడియో డయాగ్నసిస్-08, రేడియోథెరపీ-02, ట్రాన్స్‌ఫ్యూషియన్ మెడిసిన్-05, ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్-04.


అర్హతలు: ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్. సంబంధిత విభాగంలో డీఎన్‌తోపాటు ఎంసీఐ/ఎన్‌ఎంసీ/స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.  


వయోపరిమితి: 19.12.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.1770, ఈడబ్ల్యూఎస్‌ రూ.1416, చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు Bank of Baroda, AIIMS, Bibinagar, ACC: 66120100000006, IFSC: BARB0DBCHND పేరిట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. డెన్‌టిస్ట్రీ పోస్టులకు డిసెంబరు 21న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. నెగెటివ్ మార్కులు ఉండవు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.


పేస్కేలు: లెవల్-11 పే మ్యాట్రిక్స్ (7th CPC) కింద వేతనం, ఇతర అలవెన్సులు ఇస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 19.12.2023.


➥ ఇంటర్వ్యూ తేదీలు: 21.12.2023 - 23.12.2023.


➥ రిపోర్టింగ్ సమయం: ఉదయం 8 గంటలు.


➥ ఇంటర్వ్యూ సమయం: విభాగాలవారీగా ఉదయం 9.30 - మధ్యాహ్నం 1.00 గంట వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.00 - సాయంత్రం 6.00 గంటల వరకు రెండో సెషన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.


ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు రిపోర్టింగ్ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు.. 


➥  పుట్టినతేదీ సర్టిఫికేట్ 


➥  పదోతరగతి మార్కుల సర్టిఫికేట్ 


➥  ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ 


➥ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ 


➥ ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్ డిగ్రీ సర్టిఫికేట్


➥ యూజీ/పీజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్


➥ క్యాస్ట్ సర్టిఫికేట్


Notification


Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...