AIIMS Bhopal Recruitment: భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ గ్రూప్-సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 233 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 10+2, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 233


* గ్రూప్-సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులు 


సోషల్ వర్కర్: 02


ఆఫీస్/ స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్): 40 


లోయర్ డివిజన్ క్లర్క్: 32


స్టెనోగ్రాఫర్: 34


డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్): 16


జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్): 10


డిసెక్షన్ హాల్ అటెండెంట్స్: 08


అప్పర్ డివిజన్ క్లర్క్: 02


డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్: 02


జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ): 01


సెక్యూరిటీ-కమ్-ఫైర్ జమాదార్: 01


స్టోర్ కీపర్-కమ్-క్లర్క్: 85


అర్హతలు: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 10+2, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: నిబంధనల మేరకు. 


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రూ.600.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.10.2023.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023.


Notification


Website


ALSO READ:


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో 140 కంట్రోల్‌ ఇంజినీర్‌ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ లిమిటెడ్ సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ క్వాలిటీ అసూరెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాలకు డీన్, యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రీజియన్‌లో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..