బిగ్ బాస్ సీజన్ 7 అనేది పవర్ అస్త్రా అనే కొత్త కాన్సెప్ట్‌తో మొదలయ్యింది. ఆ అస్త్రం కోసం కంటెస్టెంట్స్ అంతా తెగ కష్టపడ్డారు. అమర్‌దీప్‌కు మూడుసార్లు ఆ అస్త్రం చేతివరకు వచ్చింది కానీ చేజారిపోయింది. అలా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ ఎప్పటికప్పుడు ఆ పవర్ అస్త్రా కోసం పోటీపడగా.. అందులో ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే పవర్ అస్త్రాలను సాధించారు. కానీ నేడు (అక్టోబర్ 3న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఆ పవర్ అస్త్రాలను బిగ్ బాస్ తిరిగి వెనక్కి తీసేసుకున్నట్టు ఒక ప్రోమోలో తెలుస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ప్రోమో విడుదలయ్యింది.


కెప్టెన్సీ కోసం పోటీ..
బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్రాల కోసం పోటీ ముగిసిందని, ఇప్పటినుండి కెప్టెన్సీ అనేది మొదలు అని బిగ్ బాస్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ‘‘ఈ సీజన్ యొక్క మొట్టమొదటి కెప్టెన్సీ, దాని వల్ల వచ్చే సూపర్ ఇమ్యూనిటీ దక్కించుకోవానికి బిగ్ బాస్ ఇస్తున్న ఛాలెంజ్ గెలిపించేది మీ నవ్వే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నవ్వును పూర్తి చేసేందుకు పోటీపడవలసి ఉంటుంది’’ అని  బిగ్ బాస్ చెప్పడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. ముందుగా ఈ ఛాలెంజ్ కోసం కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్‌లుగా విడిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఇద్దరు కంటెస్టెంట్స్ కలిసి ఆడవలసి ఉంటుంది. గౌతమ్ కృష్ణ, సందీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్.. ఒక టీమ్‌లో ఉండి ముందుగా పోటీలోకి దిగినట్టు ప్రోమోలో చూపించారు. 


బురద టాస్క్..
ముందుగా కంటెస్టెంట్స్ అంతా అక్కడ ఉన్న బురదలో దూకి, ఆ తర్వాత టబ్‌లో ఉన్న నురగను దాటి యాక్టివిటీ ఏరియాలోకి చేరుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసిన రెండు టబ్స్‌లో థర్మకోల్ బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్‌లో వారు కాయిన్స్‌ను వెతకాలి. అదే క్రమంలో ముందుగా శోభా శెట్టికి, సందీప్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. శోభా శెట్టికి కాయిన్ దొరకగా.. సందీప్ దానిని ఇచ్చేయమని గొడవ మొదలుపెట్టాడు. నువ్వు ఇది తీసుకోవడానికి వీలులేదు అంటూ శోభా అరిచింది. ఆ తర్వాత ఛాలెంజ్‌ను పూర్తి చేసినందుకుగానూ వచ్చి బజర్ నొక్కింది. ఈ టాస్క్‌లో శివాజీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. దీంతో ప్రాపర్టీని తన్నుతూ.. ‘‘తీసేయండయ్యా. ఏం మనుషులు అయ్యా’’ అంటూ కోపడ్డాడు.


కంటెస్టెంట్స్ మధ్య గొడవ..
టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. అమర్‌దీప్, శోభా, శుభశ్రీ, సందీప్, పల్లవి ప్రశాంత్.. ఇలా అందరు అరవడం మొదలుపెట్టారు. కాయిన్స్ తన దగ్గర దాచుకోలేదంటూ వాదించడం మొదలుపెట్టింది శుభశ్రీ. కానీ అమర్ అది నమ్మలేదు. బజర్ నొక్కిన విషయంలో శుభపై అరిచాడు అమర్. ఇక శోభా శెట్టి కూడా ‘‘ఇక్కడ ఫేవరిజం అనేది ఉండొద్దు. ఎవరు నిజాయితీగా ఆడారో వారికే దక్కాలి’’ అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఈ గొడవ మధ్యలో బొక్క అనే పదాన్ని ఉపయోగించాడు అమర్‌దీప్. అది శుభశ్రీకి నచ్చలేదు. దీంతో అలాంటి ప్రవర్తన నాకు నచ్చదు అంటూ తన మీద అరిచింది శుభ. నా ప్రవర్తన ఇంతే అంటూ సీరియస్ అయ్యాడు అమర్. 



Also Read: శుభశ్రీ, గౌతమ్ రొమాన్స్ - నాదొక బ్రతుకా అంటూ శివాజీ ఫ్రస్ట్రేషన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial