దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఫ్రెషర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ సంస్థలో జాబ్‌ ఆఫర్‌ లెటర్లు పొందిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించింది. టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఈ మేరకు స్పష్టంచేశారు. టెక్ పరిశ్రమలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, టీసీఎస్‌ మాత్రం ఫ్రెషర్‌లను నియమించుకోవడానికి, వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని లక్కడ్ చెప్పారు.


2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం.. టీసీఎస్‌ 44,000 మంది ఫ్రెషర్‌లకు జాబ్ ఆఫర్‌లను అందించింది. ఈ జాబ్ ఆఫర్‌లను అన్నింటినీ తాము గౌరవిస్తామని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. తాము అన్ని జాబ్ ఆఫర్‌లను గౌరవిస్తున్నామని, 2023 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రాతిపదికన 22,600 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని లక్కడ్ చెప్పారు.


ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి టీసీఎస్‌ ప్రయత్నాలను ప్రకటించింది. జూనియర్‌ ఉద్యోగులు తమ నైపుణ్యం పెంచుకుని జీతాలను రెట్టింపు చేసుకునే అవకాశాలను కల్పించనున్నట్లు మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని తమ కెరీర్‌లో ముందుకు సాగేలా అంతర్గత శిక్షణ అందిస్తామన్నారు. ఈ శిక్షణలో వివిధ స్థాయిల నుంచి వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపి అసెస్‌మెంట్‌లను క్లియర్ చేసిన ఉద్యోగులు తమ జీతాలను రెట్టింపు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ అసెస్‌మెంట్‌లలో సంవత్సరానికి కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 


టీసీఎస్ ఫ్రెషర్‌లకు వేతనాలను పెంచడంతోపాటు జూనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు 100 శాతం త్రైమాసిక వేరియబుల్ వేతనం అందించడాన్ని కూడా పరిశీలిస్తోందని లక్కడ్ పేర్కొన్నారు. అయితే ఈ జీతాల పెరుగుదల ఎప్పటి నుంచి ఉంటుందో ఆయన వెల్లడించలేదు. ఒకేసారి ఉద్యోగుల జీతాలు పెంచడం కన్నా శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి ప్రతిభావంతులకు జీతాలు పెంచడం మెరుగైన వ్యూహమని పేర్కొన్నారు.


Also Read:


షార్‌ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు- అర్హతలివే!
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ కేటగిరీ/ విభాగాల్లో టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్/డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల, అడ్మిట్‌కార్డులు అందుబాటులో!
సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి వాయిదాపడిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఈటీ, పీఎస్‌టీ) తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 1 నుంచి 15 వరకు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థలు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే అనుమతి ఉండదు.
అడ్మిట్ కార్డులు, ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..