Trending
Fake Smile: నవ్వితే ఆరోగ్యమే.. కానీ నకిలీ నవ్వుతోనే అసలు సమస్య
నవ్వు ఆరోగ్యానికి మంచిది.. కరెక్టే. కానీ నకిలీ నవ్వు అస్సలు మంచిది కాదట. లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుందట. ఓ పరిశోధనలో తేలిన విషయమిది.
మనం రోడ్డు మీద వెళ్తుంటాం. మనసులో ఏదో విషయం గురించి ఆలోచిస్తుంటాం. ఆ సమయానికే ఎవరో తెలిసిన వాళ్లు ఎదురుగా వెళ్తారు. సరే మాట్లాడకపోయినా.. ఓ ఫేక్ స్మైల్ అయినా విసిరేస్తాం.. కదా. ఏదో తెలిసిన వాళ్లు ఒక నవ్వు నవ్వకపోతే.. ఏం అనుకుంటారోననుకుంటాం. కానీ అలాంటి నకిలీ నవ్వులు ఆరోగ్యానికి మంచిది కాదు. ఓ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పబ్లిక్ సర్వీస్ లో జాబ్ చేసేవారు.. ఆఫీసులో ఉన్నంత సేపు చిరునవ్వు చెదరకుండా మెయింటెన్ చేస్తారు. అది వారి ఉద్యోగంలో ఒక పార్ట్. కస్టమర్ ఎంత చిరాకుతో మాట్లాడిన స్మైల్ మెయింటెన్ చేయాలి. కస్టమర్ ఎలా మాట్లాడిన చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. కోపంతో ఏదేదో మాట్లాడిన.. పైకి మాత్రం బ్యాలెన్స్ గా ఉండి.. సమాధానం చెప్పాలి. వారు లోపల ఎంత కోపంతో ఉన్నా.. ముఖం మీద మాత్రం చిరునవ్వు అసలు పోనివ్వరు. కానీ అది వారి హెల్త్ కి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం కారణంగా.. జీవన విధానం పూర్తిగా మారిపోతుందట.
ముఖానికి నవ్వు అంటుకున్నట్టు నటించే వాళ్లు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ అనే జర్నల్ లో ఈ విషయం తెలిపారు. నకిలీ నవ్వుతో వచ్చే నష్టాలేంటో వివరించారు. పబ్లిక్ సర్వీస్ లో ఉండే వ్యక్తులతో చేసిన సంభాషణలతో పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు.
ఇలా పని కోసం నవ్వు నవ్వే వాళ్లు... తమ వ్యక్తిగత భావాలు మనసులోనే దాచి పెట్టేస్తారట. ఈ కారణంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువవుతుందని పరిశోధనలో తేలింది. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారని తెలిసింది.
రెస్టారెంట్లు, డీటెయిల్స్ స్టోర్లలో పని చేసే వారికి ఫేక్ స్మైల్ తో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో గుర్తించారు. కాబట్టి అలాంటి జాబ్స్ చేసేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. మైండ్ సేట్ ఎలా ఉందో.. అంచనా వేసుకుని.. ఏదైనా సమస్య ఉంటే నిపుణులను సంప్రదించండి. ఆ ఉద్యోగాలు చేసేవారే కాకుండా.. బయట కలిసిన వారి దగ్గర కుడా.. నకిలీ నవ్వు లేకుండా మెయింటేన్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిది. లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం కంటే.. ఆరోగ్యంపై దృష్టి పెడితే ఎలాంటి సమస్యలు రావు.
Also Read: Monsoon Mobile Tips: వానలో ఫోన్ తడిస్తే ప్రయోగాలొద్దు.. పేలే ఛాన్స్ ఉంది..
Sitting Hours: గంటల కొద్దీ కూర్చుని ఉంటే... ప్రాణానికే ముప్పు... తస్మాత్ జాగ్రత్త