యాబెటిస్ వచ్చాక తగ్గించుకోలేము. కానీ ప్రీ డయాబెటిస్ గురించి తెలుసుకుంటే మాత్రం మధుమేహం బారిన పడకుండా చికిత్స తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధరణం కంటే ఎక్కువగా ఉండి మధుమేహం వచ్చే సూచనలు కనిపిస్తే దాన్ని ప్రీ డయాబెటిస్ అంటారు. ప్రీ డయాబెటిస్ అంటే మీరు ఇంకొన్ని రోజుల్లో డయాబెటిస్ బారిన పడబోతున్నారని సంకేతం. దాన్ని ముందుగా గుర్తిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. సరైన ఆహారం తింటూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. సాధారణ కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే ఆహారం, కృత్రిమ రుచులు కలిగిన ఆహారం అధికంగా తీసుకుంటే త్వరగా డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది.


ఎలా గుర్తించాలి?


Hb1ac స్థాయిలు 4% నుంచి 5.6% వరకు ఉండాలి. అదే Hb1ac స్థాయిలు 5.7% నుంచి 6.4% మధ్య ఉంటే మీకు ప్రీ డయాబెటిస్ ఉందని మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. 6.5% లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉంటే మాత్రం మీరు ఇప్పటికే డయాబెటిస్ బారిన పడిపోయారని అర్థం. రక్తపరీక్ష ద్వారా ప్రీ డయాబెటిస్ గురించి తెలుసుకోవచ్చు. సదరు వ్యక్తి దగ్గర నుంచి సేకరించిన రక్తం ద్వారా మూడు నెలల ముందు నుంచి రక్తంలో చక్కెర శాతం సగటు ఎంత ఉందనేది తెలుసుకుంటారు.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


ప్రీ డయాబెటిస్ వస్తుందని తెలుసుకున్న తర్వాత దాన్ని ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా తిప్పి కొట్టొచ్చు. అప్పుడు మీరు మధుమేహం బారిన పడే ప్రమాదం నుంచి బయట పడతారు.


⦿ జీవనశైలిలో మార్పులు


⦿ స్వీయ సంరక్షణ


⦿ వ్యాయామం


⦿ తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవడం


ప్రీ డయాబెటిస్ టైమ్ లో ఏం తినాలి? ఏం తినకూడదు?


ప్రీ డయాబెటిస్ సమస్య నుంచి బయట పడాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.


⦿ కొంచెం తినాలి, కానీ తరచూ కొద్ది కొద్దిగా తీసుకోవాలి


⦿ భోజనం, బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండటం చేయకూడదు


⦿ తక్కువ గ్లైసెమిక్ ఆహారాన్ని ఎంచుకోవాలి


ఉదాహరణకి ఒక వ్యక్తి మధ్యాహ్న భోజనంలో అన్నం ఎంచుకుంటే ఒక గిన్నె పప్పు తీసుకోవాలి. ఒక గిన్నె సలాడ్ తో భోజనం పూర్తి చేయాలి. పప్పు, అన్నం తినడానికి ముందు సలాడ్ తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఆహార జాబితా కిందకు వస్తుంది. అప్పుడు అన్నంలో ఉండే చక్కెర స్థాయిల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.


ఇవి తప్పనిసరి


ప్రీ డయాబెటిస్ నుంచి బయట పడేందుకు ఆహార విధానం మార్చుకోవడమే కాదు శారీరక శ్రమ కూడా ముఖ్యం అందుకే ప్రతి రోజు క్రమం తప్పకుండా శరీరానికి చెమట పట్టే విధంగా ఏదైనా పని చేయాలి.


☀ సైక్లింగ్


☀ జాగింగ్


☀ డాన్స్


☀ చురుకుగా నడవడం


☀ కృత్రిమ, చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం


డ బేకరీ ఉత్పత్తులు వీలైనంత వరకు దూరంగా నివారించడం ఉత్తమం


ఏం తినాలి?


ప్రీ డయాబెటిస్ రోగులకు వైద్యులు కొన్ని ఉత్తమమైన ఆహారాలను సూచిస్తున్నారు. అవేంటంటే..


☀ తృణధాన్యాలు


☀ పండ్లు


☀ కూరగాయలు


☀ బెర్రీలు


☀ మిల్లెట్స్


☀ కాఫీ


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఎయిర్ ఫ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?