ప్రతి విటమిన్, మినరల్ శరీరానికి ఎంతో కొంత మేలు చేస్తుంది. విటమిన్ల లోపం వల్ల ఎన్నో రోగాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకే విటమిన్ లోపాలు లేకుండా చూసుకోమని సూచిస్తారు వైద్యులు. అయినా కూడా మనం తినే ఆహారంలో జంక్ ఫుడ్ అధికంగా మారడం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకునే పద్ధతి తగ్గడం వల్ల ఆధునిక కాలంలో విటమిన్ లోపాలు పెరిగిపోతున్నాయి. అలాగే విటమిన్ లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల మానసికంగా చాలా కుంగిపోతారు. అందుకే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే విటమిన్ బి12 లోపం లేకుండా చూసుకోమని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. 


ఇంకా ఎన్నో సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా 15 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ విటమిన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అవ్వదు. అందుకే ఆహారం ద్వారానే తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం శక్తి హీనత కలుగుతుంది. దీనివల్ల శరీరమంతా నీరసంగా అనిపిస్తుంది. మెదడులో డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్ల ఉత్పత్తికి విటమిన్ బి12 అవసరం. ఆ రెండు హార్లోన్లు విడుదలవ్వకపోతే ఆనందం, సంతోషం తక్కువ కలుగుతుంది. ఎప్పుడూ నిరాశగా అనిపిస్తుంది. డిప్రెషన్ బారిన త్వరగా పడతారు. 


వికారం, అలసట
నాడీ వ్యవస్థ పనితీరుకు విటమిన్ బి12 చాలా అవసరం. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే వికారంగా, అలసటగా అనిపిస్తుంది. కళ్లు తిరుగుతున్నట్టు అవుతాయి. మెదడు పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. విషయాలు త్వరగా గుర్తురావు. మతిమరుపు బారిన అవకాశం ఎక్కువ. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాసలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. 


తినాల్సినవి ఇవే
చికెన్, మటన్ వంటి మాంసాహారంలో విటమిన్ బి12 లభిస్తుంది. సార్డెన్స్, టూనా వంటి చేపల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. పాలు, పెరుగు, చీజ్, బటర్ వంటి పాల ఉత్పత్తుల్లో కూడా లభిస్తుంది. గుడ్లలో కూడా పుష్కలంగా ఉంటుంది. రోజుకో గుడ్డు తింటే విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: సత్యనాదెళ్ల కొడుకును బలితీసుకున్న సెరెబ్రల్ పాల్సీ, ఇదో భయంకరమైన వ్యాధి


Also read: భారత పాస్‌పోర్టు ఉంటే చాలు, ఈ దేశాల్లో వీసా లేకుండా హ్యాపీగా తిరిగేయచ్చు