పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 


మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీశారు. ఆయనకు జోడీగా నిత్యామీనన్ నటించింది. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. వీకెండ్ లోనే కాకుండా.. వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. 


ప్రాంతాల వారీగా నాలుగు రోజుల కలెక్షన్స్..


నైజాం           రూ.24.85 కోట్లు


సీడెడ్           రూ.7.85 కోట్లు


ఉత్తరాంధ్ర    రూ.5.10 కోట్లు


ఈస్ట్               రూ.3.89 కోట్లు


వెస్ట్                రూ.4.12 కోట్లు


గుంటూరు       రూ.4.22 కోట్లు


కృష్ణా               రూ.2.68 కోట్లు


నెల్లూరు           రూ.1.93 కోట్లు 


ఏపీ + తెలంగాణ (టోటల్)  రూ.54.64 కోట్లు 


రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.6.65 కోట్లు 


ఓవర్సీస్            రూ.10.31 కోట్లు 


వరల్డ్ వైడ్ టోటల్ గా రూ.71.60 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. నాలుగు రోజులు పూర్తయ్యేసరికి రూ.71 కోట్లు షేర్ ను రాబట్టింది. ఈరోజు సెలవు కాబట్టి భారీ కలెక్షన్స్ ను సాధించే అవకాశం ఉంది.