Viral News: అబ్రాస్ ప్రిటోరియస్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ గురివింద మొక్క అంటే మాత్రం ఇట్టే పట్టేస్తారు. దీంతో చాలామంది ఆడుకునే ఉంటారు. చాలామంది చూసి ఉంటారు. కానీ ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో దీన్ని పిలుపుస్తారు. పేర్లు ఎలా ఉన్నా చూడడానికి చాలా అందంగా ఉంటుందీ చెట్టు. అలాగే దాని కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. అందంగా ఉన్నాయి కదా అని ఆ చెట్టు దగ్గరికి వెళ్లేరు. అది చాలా ప్రమాదకరమండి. అవును ఈ చెట్టు కాయలను తాకినా, వాటిని పొరపాటున తిన్నా ప్రాణాలే పోయే ప్రమాదముంది. వీటి విషం కోబ్రా పాము కన్నా ఎక్కువ పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ మొక్క విత్తనాలలో అబ్రిన్ అనే విషం ఉంటుంది. దీని బారిన పడిన రోగి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అంతే ఇక. మరి ఇంత డేంజరస్ మొక్క గురించి మనమూ తెలుసుకుందాం...


నేటికీ భారతదేశ జనాభాలో సగానికి పైగా గ్రామాలలో నివసిస్తున్నారు. వివిధ రకాల మొక్కలు, గడ్డి మరియు అడవి పొదలు గ్రామాల్లో ప్రతిచోటా కనిపిస్తాయి. నగరాల్లో కూడా చాలాసార్లు అనుకోకుండా మన కుండీలలో కొన్ని మొక్కలు నాటుతాం. అవి చూడటానికి అందంగా ఉంటాయి. అయితే అవి ఒక్కోసారి ప్రమాదకరమైన మొక్కలు కూడా కావచ్చు. ఇటీవల ఒక రోగి సర్ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లాడు. అతను మధ్యప్రదేశ్ కు చెందిన 7 ఏళ్ల చిన్నారి. ఆ చిన్నారి మొదడు వాచిపోయి రక్త విరోచనాలతో హాస్పిటల్ లో చేరాడు. వైద్యులు అన్ని పరీక్షలు క్షుణ్నంగా చేసిన తర్వాత అతని శరీరంలో ఈ గురివింద మొక్క విత్తనాలలో ఉండే అబ్రాస్ అనే విషం ఉన్నట్లు గుర్తించారు. 


ఈ మొక్కను తాకకూడదు


గురివింద మొక్క విషం పాము విషం కన్నా ప్రమాదకరమైనది. ఒక్కసారి ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తే తర్వాత దాన్ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. అందువల్ల ఈ మొక్క నుంచి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 


ఈ మొక్క ఎలా ఉంటుందంటే


ఈ మొక్క ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ రంగు కాయలను కలిగిఉంటుంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇంటి చుట్టూ కూడా ఉండవచ్చు. ఒకవేళ అది మీకు కనిపిస్తే దాన్ని తాకకుండా నేల నుంచి పూర్తిగా తీసేసి సరిగ్గా పాతిపెట్టాలి. వీలయితే అటవీ నిపుణులను సంప్రదించాలి. 


అబ్రాస్ ప్రిటోరియస్ విషం శరీరంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది?


అబ్రాస్ ప్రిటోరియస్ విషం ఒక వ్యక్తి శరీరంలోకి చేరిన వెంటనే, అది కణాలను లోపలి నుంచి అనారోగ్యానికి గురి చేస్తుంది. ప్రొటీన్లను తయారు చేయనీయకుండా కణాలను అడ్డుకుంటుంది. శరీరంలో ప్రోటీన్ తయారీ ఆగిపోయిన వెంటనే కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. క్రమంగా వ్యక్తి మరణిస్తాడు. ఈ మొక్క చాలా ప్రమాదకరమైనది. దాని విత్తనాలు, ఆకులు, కాండం మొత్తంగా ఆ మొక్క మొత్తం ప్రమాదకరమైనదే. 


దీని వల్ల ప్రయోజనాలూ ఉన్నాయండోయ్


పాము విషం ప్రమాదకరమైనది. కానీ దాన్ని కూడా కొన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే గురివింద మొక్క కూడా కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ మొక్క చాలా ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక, యాంటీ ట్యూమర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి.  క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి వైద్య సలహా ప్రకారం పరిమిత మోతాదులో ఈ మొక్కను ఇస్తే అతని శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగవు. ఎరుపు మరియు నలుపు రంగులో కనిపించే ఈ మొక్క మీ స్పెర్మ్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. అయితే నిపుణుల సలహా లేకుండా దీనిని ఉపయోగించవద్దు. ఎందుకంటే అందులో చాలా విషం ఉంటుంది.  మీరు చేసే చిన్న పొరపాటు మీ ప్రాణాలను హరించవచ్చు.