Winter Laziness : శీతాకాలం వచ్చేసింది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే.. వణికిపోవాల్సిందే. ఎంతసేపు పడుకున్నా.. ఇంకా పడుకోవాలనిపిస్తుంది. కేవలం ఉదయం మాత్రమే కాదు.. ఈ చలికాలంలో రోజంతా బద్దకంగానే ఉంటుంది. ఏ పనిచేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. వ్యాయామం కూడా చేయాలనిపించదు. ఒక్కే చోట కూర్చోవాలనిపిస్తుంది. దీంతో సోమరితనం ఆవహిస్తుంది. ఈ అలవాట్లు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మీరు బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలకు గురవ్వుతారు. అయితే ఈ బద్ధకాన్ని తరిమికొట్టి.. హుషారుగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. సూర్యకాంతిలో ఎక్కువ సమయం గడపండి:


ఈ  చలికాలంలో మీ దుప్పటి మీకు బెస్ట్ అనిపిస్తుంది. ఆఫీసులో కిటికీలన్నీ మూసేసి పనిచేస్తే చలిగాలుల నుంచి రక్షించుకోవచ్చు. కానీ పగటి పూట ఆరు బయట సమయం గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మీ మానసిక స్థితి, శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మీ ఇంటి దగ్గర సహజకాంతి మీపై పడేలా చూసుకోండి. ఇంట్లో కరెక్టన్లను తెరిచి పెట్టండి. సూర్యకిరణాలు ఇంట్లోకి పడటంతో మీకు కావాల్సినంత వెచ్చదనంతోపాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. 


2. ఇంట్లోనే వ్యాయామాలు చేయండి:


ఈ కాలంలో బయటకు వెళ్లాలనిపించదు. ఆ సమయంలో ఇంట్లోనే వ్యాయామం చేయడం మంచిది. ఇంట్లోనే యోగా, ఇంటి వ్యాయామాలు చేయాలి. లేదంటే డ్యాన్సులు కానీ ఇండోర్ వ్యాయామాలు వంటివి చేస్తుండాలి. మీరు మంచి శారీరక కదలికలతో కూడిన ఇంటిపనిని కూడా చేసుకోవచ్చు. 


3. హాయిగా నిద్రపోండి:


సమయానికి తినడం, సమయానికి నిద్రించడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. నిద్ర తక్కువైనా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే మంచి నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి. బాగా విశ్రాంతి తీసుకోండి. ఇలా చేస్తే బద్దకం నుంచి బయటపడొచ్చు.


4. మంచి ఆహారం తినండి:


చలికాలంలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. సమతుల్య ఆహారం ఆరోగ్యానికి ఎంతో కీలకం. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు శక్తిని అందిస్తాయి. బద్దకాన్ని దూరం చేస్తాయి. వేడి వేడి ఆహారం, సూప్‌లు తీసుకోండి.


5. మైండ్ ఫుల్ నెస్:


ధ్యానం, శ్వాస తీసుకుని వదలడం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక శ్రేయస్సును పెంపొందిస్తాయి. కాలానుగుణ ఉత్పత్తులు, ఆకు కూరలను తినండి. వేడి వేడి ఆహారం తింటే ఈ కాలంలో ఆరోగ్యంగా ఉంటాం. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. 


6. కొత్త హాబీలను ట్రై చేయండి:


చలికాలంలో కూర్చున్న చోటే కొత్త హాబీలను ట్రై చేయండి. పెయింటింగ్, చదవడం లేదంటే కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం వంటి ఇండోర్ హాబీలను అలవాటు చేసుకోండి. 


Also Read : మీ స్కిన్​ టోన్ డార్క్​ అవుతోందా? ఈ ఇంటి చిట్కాలతో టాన్​ రిమూవ్ చేసేయొచ్చు











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.