Naga Panchami Serial Today Episode


పంచమి మేఘనను ఇంటికి తీసుకొచ్చి తన చిన్ననాటి స్నేహితురాలు అని అందరికీ పరిచయం చేస్తుంది. ఇక మేఘన బామ్మ, వైదేహి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. 


పంచమి: అత్తయ్య మీకు ఏం అభ్యంతరం లేకపోతే తను కొంత కాలం నాతో పాటే ఉంటుంది.
మేఘన: నాకు ఎవ్వరూ లేరు ఆంటీ. మీ లాగా పది మంది నిండుగా ఉన్న ఇంట్లో గడపాలి అనే ఆశ. 
పంచమి: కొన్ని రోజులే అత్తయ్య గారు చాలా మంది ఉన్న ఇంట్లో గడపాలి అని ఎంతో ఆశతో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. 
మేఘన: మీతో కలిసి ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజుల్ని నా జీవితాంతం ఎప్పటికీ గుర్తించుకుంటాను.
జ్వాల: మరీ అంత ఆశలు పెట్టుకోకు. ఈ ఇంట్లో ఎవరి చీటీ ఎప్పుడు చిరిగిపోతుందో కాలు ఎప్పుడు బయట పెట్టాల్సి వస్తుందో అస్సలు తెలీదు. 
మోక్ష: పంచమి గెస్ట్‌ని లోపలికి తీసుకెళ్లు.
వైదేహి: మోక్ష చెప్పిన తర్వాత కాదు అనేది ఏముంది లోపలికి తీసుకెళ్లు. 
పంచమి: ఇంతకు ముందు ఈ గదిలో ఓ రాక్షసి ఉండి వెళ్లింది. దాని వస్తువులు అన్నీ తీసుకెళ్లి తగలబెడతాను.
మేఘన: మీరు తాకకండి యువరాణి.
పంచమి: నన్ను పంచమి అని పిలువు మేఘన ఎవరికీ ఏ అనుమానం రాదు.
మేఘన: అలాగే పంచమి ఆ సామాను సంగతి నేను చూసుకుంటా.ఏదో ఒక విధంగా నన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టగలిగావ్.. ఇక మనం త్వరగా ఆ నాగమణి సంగతి చూడాలి. (దీనికి నా మీద ఎంత కోపం ఉందో తెలుస్తూనే ఉంది. నేనే కరాళి అని తెలిస్తే గుండె ఆగి చస్తుందేమో)
పంచమి: మేఘన నేను మళ్లీ మళ్లీ అడుగుతున్నాను అని ఏం అనుకోవద్దు నా భయాలు నావి.
మేఘన: ఏం పర్లేదు పంచమి. నీ భర్త కోసం నీ భయాలు నీవి. 
పంచమి: నాగలోకం నుంచి నాగమణి తీసుకొచ్చి నా భర్త ప్రాణాలు కాపాడుకోవడం సాధ్యమేనా మేఘన.
మేఘన: నాగమణి శక్తి నాకు తెలుసు. అనుమానమే అవసరం లేదు.
పంచమి: అలా కాదు మేఘన ఫణేంద్ర చెప్తున్నట్లు నాగమణిని ఈ లోకానికి తీసుకురాగలమా అని.. 
మేఘన: అర్థం చేసుకో పంచమి.నిన్ను ఎలా అయినా ఫణేంద్ర నాగలోకం తీసుకెళ్లి పోవాలి. అందుకోసం నీ భర్తను వదిలివెళ్లిపోవడానికి నువ్వు సిద్ధపడ్డావు. దానికి ప్రతిఫలంగా ఫణేంద్ర నీ భర్తను కాపాడటానికి సాయం చేస్తానని మాటిచ్చాడు. 
పంచమి: తన మాట తప్పితే నా భర్త ప్రాణాలు మళ్లీ తిరిగిరావు. నా చేతులతో నా భర్తను చంపుకున్న మహా పాపం నేను మూటకట్టుకోవాలి. ఫణేంద్రను నమ్మి అంత పెద్ద సాహసం చేయడానికి నా మనసు భయపడుతుంది. 
మేఘన: నీకు కూడా మరోమార్గం లేదు కదా పంచమి. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకర్ని నమ్మి తీరాలి. ఫణేంద్రని నువ్వు నమ్మకపోయినా నీ భర్త ప్రాణాలను నువ్వు కాపాడుకోలేవు. ఇష్టరూప నాగ జాతి నాగుల గురించి నా కన్నా నీకే బాగా తెలుసు. ముక్కోటి ఏకాదశి వరకే నీకు ఏ అవకాశం అయినా. ఆ తర్వాత మోక్ష ప్రాణాలతో ఉండటం ఆసాధ్యం.
పంచమి: నేను నా భర్తను కాటేసి ఫణేంద్రతో నాగలోకం వెళ్లిన తర్వాత అక్కడ నుంచి నేను తిరిగి రాలేకపోయినా నాగమణిని తీసుకు రాలేకపోయినా నేను నా భర్తకు నమ్మకద్రోహం చేసిన దాన్ని అవుతాను.
ఫణేంద్ర: దూరం నుంచి వారి మాటలు వింటూ.. కచ్చితంగా జరగబోయేది అదే యువరాణి. ఒక్క సారి మోక్షని కాటేసిన తర్వాత బతికించడం జరగదు. నీ చేతులతో నీ భర్తను కాటేయించడం నిన్ను నాగలోకానికి తీసుకెళ్లడం నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అదే జరుగుతుంది. జరిగితీరుతుంది. 
పంచమి: మోక్ష బాబు తన ప్రాణాలైన వదులు కుంటారు కానీ.. నేను శాశ్వతంగా నాగలోకంలో ఉండిపోతాను అంటే మాత్రం మోక్షబాబు ఏ మాత్రం ఒప్పుకోరు. 
మేఘన: నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు మాత్రం ఏం చేయగలవు పంచమి. నువ్వు నాగలోకం వెళ్లినా వెళ్లకపోయినా మోక్ష నువ్వు కలిసి ఉండే అవకాశమే లేదు. ఫణేంద్ర చెప్పినట్లు చేస్తే మీరిద్దరూ చెరో లోకంలో ఉన్నా కనీసం ప్రాణాలతోనైనా ఉంటారు. 
ఫణేంద్ర: నా భార్యగా యువరాణి ప్రాణాలతో ఉంటుంది. కానీ మోక్ష ప్రాణాలతో ఉండడు. ఒక్కసారి యువరాణి నాగలోకం రావడం జరిగితే తిరిగి భూలోకం రావడం జరగదు. 
పంచమి: సరే మేఘన నా ప్రయత్నం నేను చేస్తాను. 
మేఘన: మీరు నాగమణిని తెచ్చేంత వరకు మోక్షబాడీని నేను కాపాడుతాను. ఈ అవకాశాన్ని వదులుకోకు పంచమి.
కరాళి: నువ్వు మోక్షను ఒప్పిస్తావ్.. నాగమణిని తెస్తావు పంచమి.. నీకు మోక్ష దక్కడు. నాగమణి ఉండదు. మోక్ష నావాడు అవుతాడు. నాగమణి నా సొంతం అయిపోతుంది. తర్వాత నీ బతుకుంతా నా కాళ్ల దగ్గరే ఉంటుంది. ఈ కరాళితో పెట్టుకున్న నీకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగలవు మిగిలించను. 


ఇక జ్వాల కిచెన్‌లో సేమ్యా పాయసం చేస్తుంటుంది. అందులో మందు కలిపి చిత్రకు ఇచ్చినట్లు చిత్ర కల కంటుంది. పెద్దగా అరుస్తూ లేచి చూస్తుంది. కిచెన్‌లో జ్వాల పాయసం చేస్తూ కనిపిస్తుంది. ఇంతలో జ్వాల చిత్రను పిలుస్తుంది. పాయసం తాగమని చెప్తుంది. చిత్ర వద్దని షాకులు చెప్తుంది. అందర్ని చంపేయాలి అని జ్వాల ఇలా చేస్తుంది అని అనుకుంటుంది. ఇక చిత్ర భయపడుతూనే పాయసం తాగుతుంది.


వైదేహి: నా కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నావు అంటే నీలో ఏదో లోపం ఉందని అర్థం. మా మోక్షకు ఇంకా గండం తప్పిపోలేదు అంటే నువ్వే మాతో చేయించిన మహామృత్యుంజయ యాగం అబద్ధం అనుకోవాల్సిందే. 
పంచమి: లేదు అత్తయ్య మోక్ష ప్రాణాలతో ఉన్నారు అంటే ఆ యాగం ఫలితమే.
వైదేహి: ఆ యాగంతో మా మోక్షకు ఉన్న గండాలు అన్నీ తప్పిపోయావి అనే మేం భావిస్తున్నాం పంచమి. కానీ అది అబద్ధం. 


దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది. 



Read Also: ‘సలార్’ మూవీలో దుమ్మురేపిన విశాల్ వదిన, శ్రియా నటనకు ప్రేక్షకులు ఫిదా అంతే!